తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఒక్క సినిమా చేసి వెళ్లిపోదామనుకున్నా- ఆ మూవీలో హీరోగా చిరు అని ఫిక్సయ్యా!' - పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ లేటెస్ట్ సినిమాలు

Prithviraj Sukumaran Salaar : సినీప్రియులంతా ఎంతో వెయిట్​ చేస్తున్న సలార్ సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా కనిపించనున్నారు మాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌. ఓటీటీల ద్వారా తెలుగు అభిమానులను విపరీతంగా సొంతం చేసుకున్న ఆయన గురించి కొన్ని ప్రత్యేక విషయాలు మీకోసం.

Prithviraj Sukumaran Salaar
Prithviraj Sukumaran Salaar

By ETV Bharat Telugu Team

Published : Dec 17, 2023, 10:17 AM IST

Prithviraj Sukumaran Salaar :మాలీవుడ్​ ఇండస్ట్రీకి చెందిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఓటీటీల ద్వారా తెలుగు అభిమానులను విశేషంగా సొంతంగా చేసుకున్న ఆయన హీరోగా, గాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా సినీ రంగంలో తనదైనా ముద్ర వేసుకున్నారు. పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్​ సినిమాలో తెలుగు తెర మీద మరోసారిద సందడి చేయనున్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు ఆయన మాటల్లోనే.

ఇంట్లో అందరూ నటులే!
Prithviraj Sukumaran First Movie : "మాది కేరళ. నాన్న సుకుమారన్‌ నటుడు. అమ్మ మల్లిక, అన్నయ్య ఇంద్రజిత్‌, వదిన పూర్ణిమ ఇలా అందరూ నటులే. దీంతో నేను ఈ రంగంలోకి రాకుండా ఇంకేదైనా చేయాలనుకున్నా. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో డిగ్రీ చేసేందుకు ఆస్ట్రేలియా వెళ్లిపోయా. అక్కడ చదువుకుంటున్నప్పుడే రంజిత్‌ అనే దర్శకుడి నుంచి ఆడిషన్‌ కోసం పిలుపు రావడంతో సరదాగా ప్రయత్నిద్దామనుకుని స్క్రీన్‌టెస్ట్‌కు వెళ్లా. అదే నందనం సినిమా. అయితే అది మరో రెండు సినిమాల తరువాత రిలీజైంది.

తన వల్లే నేను ఈ స్థాయికి!
Prithviraj Sukumaran Relationships : "నా భార్య సుప్రియా మేనన్‌ ఒకప్పుడు జర్నలిస్ట్‌. తనతో కలిగిన పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు మాకో పాప - అలంకృతా మేనన్‌ సుకుమారన్‌. సుప్రియ వల్లే నేనీ స్థాయికి చేరుకున్నానని గర్వంగా చెబుతుంటా. అందుకే మా అమ్మాయి పేరులో సుకుమారన్‌కు ముందు మేనన్‌ను జతచేశా. ఇందుకు కొందరు నన్ను విమర్శించినా వాటిని నేను పట్టించుకోలేదు. సినిమాల్లోకి రాకపోయి ఉంటే ట్రావెల్‌ వ్లాగర్‌ని అయ్యేవాడిని"

అదో సరదా-సెట్‌లో బోర్‌ కొట్టేది!
Prithviraj Sukumaran Hobbies :"నాకు ప్రయాణాలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా నేను వెళ్లే ప్రాంతాలను ఫొటోలుగా తీసి దాచుకోవడం సరదా. తరచూ ప్రయాణిస్తూ, అపరిచితులతో మాట్లాడటం వల్ల ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోవచ్చనుకుంటా. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో సెట్‌లో ఉన్నంతసేపు కూడా చాలా బోరింగ్‌గా అనిపించేది. దాంతో ఓ సినిమా ఒప్పుకునేముందు ఇదే లాస్ట్ సినిమా. దీన్ని పూర్తిచేశాక ఆస్ట్రేలియా వెళ్లిపోవాలని అనుకునేవాడిని. అలా అనుకుంటూనే ఒక్కో సినిమా చేయడంతో క్రమంగా ఇదే నా ప్రపంచంగా మారిపోయింది. రోజులు గడిచేకొద్దీ దర్శకత్వం, నిర్మాణం, గానం వంటి విభాగాల్లోనూ నన్ను నేను నిరూపించుకునేందుకు ప్రయత్నించా"

Prithviraj Sukumaran Dulquer Salmaan : "స్కూల్లో చదువుకుంటున్నప్పుడు యాన్యువల్‌డే వస్తోందంటే చాలు డ్రామాల్లో అన్నయ్యతో కలిసి నటించేందుకు రెడీ అయిపోయేవాడిని. అలాగే ఎలక్యూషన్‌, డిబేట్స్‌ ఇలా అన్నింట్లోనూ నా పేరు ఉండాల్సిందే. ఇండస్ట్రీలో దుల్కర్​ నా స్నేహితుడు. నాకు మొదటి నుంచీ విలాసవంతమైన కార్లు, బైక్‌లు కొనడం ఓ సరదా. లాంబోర్గిని, పోర్షే, లాండ్‌రోవర్‌ డిఫెండర్‌110, రేంజ్‌ రోవర్‌, వోగ్‌, సఫారీ, మినీకూపర్‌, బీఎండబ్ల్యూ ఇలా ఏది నచ్చినా కొనేస్తుంటా"

చిరునే హీరో అని ముందే ఫిక్సయ్యా!
Prithviraj Sukumaran Movies In Telugu : "కొన్నాళ్లక్రితం మేం తీసిన లూసిఫర్‌ను తెలుగులోనూ తీసేందుకు ఆలోచిస్తున్నారని తెలిసి అందులో చిరంజీవి సర్‌ నటిస్తే బాగుంటుందని అనుకున్నా. చివరకు అదే జరిగింది. ఆ పాత్రకు ఆయన తప్ప ఎవరూ న్యాయం చేయలేరు మరి. సలార్‌కన్నా ముందు నేను పోలీస్‌ పోలీస్‌ అనే తెలుగు సినిమాలోనూ చేశా. అలాగే ఉరుమి, అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌, బ్రోడాడీ వంటి సినిమాలతో తెలుగువారికీ దగ్గరయ్యా. ఇప్పుడు సలార్‌తో మరింత చేరువ కావాలనుకుంటున్నా" అంటూ చెప్పుకొచ్చారు.

ABOUT THE AUTHOR

...view details