తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

గ్రాండ్​గా నటుడు ప్రభు కుమార్తె వివాహం- వరుడు ఎవరంటే ? - మార్క్​ ఆంటోనీ డైరెక్టర్ అధిక్​ రవిచంద్రన్

Prabhu Daughter Marriage : ప్రముఖ తమిళ నటుడు ప్రభు కుమార్తె ఐశ్వర్య వివాహం గ్రాండ్​గా జరిగింది. 'మార్క్‌ ఆంటోనీ' సినిమాతో సూపర్ సక్సెస్​ అందుకున్న యంగ్ డైరెక్టర్ అధిక్‌ రవిచంద్రన్‌ ఆమె మెడలో మూడు ముళ్లు వేశారు.

Mark Antony Director Adhik Ravichandran Marriage
Mark Antony Director Adhik Ravichandran Marriage

By ETV Bharat Telugu Team

Published : Dec 15, 2023, 2:20 PM IST

Prabhu Daughter Marriage :ప్రముఖ నటుడు ప్రభు కుమార్తె ఐశ్వర్య వివాహం గ్రాండ్​గా జరిగింది. 'మార్క్‌ ఆంటోనీ' సినిమాతో సూపర్ సక్సెస్​ అందుకున్న యంగ్ డైరెక్టర్ అధిక్‌ రవిచంద్రన్‌ ఆమె మెడలో మూడు ముళ్లు వేశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్​ ఫంక్షన్‌ హాల్‌లో ఇరు కుటుంబాల పెద్దలతో పాటు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో శుక్రవారం ఉదయం ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. అయితే ఈ పెళ్లి వేడుకకు తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులు హాజరై సందడి చేశారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతూ నటుడు విశాల్‌ తాజాగా ట్వీట్‌ చేశారు. అందులో పెళ్లి ఫొటోలను షేర్​ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.

"మై డార్లింగ్‌ అధిక్‌, నా సోదరి ఐశ్వర్యకు హృదయపూర్వక శుభాకాంక్షలు. జీవితంలో ఓ కొత్త అంకాన్ని ప్రారంభిస్తున్న మీకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అధిక్‌ నా సోదరిని ఓ యువరాణిలా చూసుకో" అంటూ విశాల్​ నూతన వధూవరులను ఉద్దేశించి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.

Director Adhik Ravichandran Marriage :ఇక అధిక కెరీర్ విషయానికి వస్తే 2015లో విడుదలైన 'త్రిష ఇల్లానా నయనతార' అనే సినిమాతో డైరెక్టర్​గా ఎంట్రీ ఇచ్చారు. 'దబాంగ్‌ 3'చిత్రానికి తమిళ డైలాగ్స్‌ ఈయనే రాశారు. అయితే ఈ ఏడాది విడుదలైన 'మార్క్ ఆంటోనీ'తో ఆయన తొలి విజయాన్ని అందుకుని సూపర్ ఫేమస్​ అయ్యారు. త్వరలోనే ఆయన అజిత్‌తో ఓ సినిమా చేసే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల సమాచారం.

మరోవైపు కోలీవుడ్‌ సీనియర్​ నటుడు ప్రభు తెలుగువారికి సుపరిచితులే. తమిళ నటుడు శివాజీ గణేశన్ కుమారుడైన ఈయన 'చంద్రముఖి', 'ఘర్షణ' (1988), 'డ్యూయెట్' (1994), 'డార్లింగ్‌', 'కథానాయకుడు', 'ఆరెంజ్‌', 'శక్తి','డార్లింగ్​' లాంటి సినిమాల్లో కీలక పాత్ర పోషించారు. ఎన్నో తెలుగు సినిమాల్లో ఆయన నాన్న పాత్ర పోషించి ఫేమస్ అయ్యారు.

ఎన్నో ఆశలతో టాలీవుడ్ ఎంట్రీ- ఈ ఏడాది కలిసిరాని అందాల హీరోయిన్లు వీరే!

'ఆ సినిమా కోసం ఫస్ట్​ నన్నే అడిగారు - అందుకు ఇప్పటికీ బాధపడుతుంటాను'

ABOUT THE AUTHOR

...view details