తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'రాజా డీలక్స్' టైటిల్ ఛేంజ్!- కారణం ఇదే - ప్రభాస్ కొత్త సినిమాలు

Prabhas Maruthi Movie Title: రెబల్​ స్టార్ ప్రభాస్- మారుతి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకు 'రాజా డీలక్స్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే తాజాగా ఆ టైటిల్ మార్చనున్నట్లు తెలుస్తోంది.

Prabhas Maruthi Movie Title
Prabhas Maruthi Movie Title

By ETV Bharat Telugu Team

Published : Jan 12, 2024, 4:27 PM IST

Updated : Jan 12, 2024, 4:45 PM IST

Prabhas Maruthi Movie Title:పాన్ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్​గా సలార్​తో హిట్​ కొట్టారు. ఇక ఆయన ప్రస్తుతం నెక్ట్స్​ ప్రాజెక్ట్​లపై దృష్టి పెట్టనున్నారు. ఈ క్రమంలో పాన్​వరల్డ్​ మూవీగా తెరకెక్కుతున్న 'కల్కీ 2898 AD' రిలీజ్ గురించి తాజాగా అప్డేట్ వచ్చింది. ఈ సైన్స్​ ఫిక్షన్, యాక్షన్​ జానర్​లో రూపొందుతున్న ఈ సినిమా 2024 మే 9న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ప్రభాస్ మరో ప్రాజెక్ట్​ గురించి కూడా ఓ అప్డేట్ వచ్చింది.

ప్రభాస్- డైరెక్టర్ మారుతి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు 'రాజా డీలక్స్' అనే టైటిల్ ఫిక్స్ చేశారని కొద్ది రోజులుగా ప్రచారం సాగింది. రాజా డిలక్స్​ అనే ఓ పాత థియేటర్ చుట్టూ సాగే కథగా చెబుతున్నారు. అయితే పాన్ఇండియా లెవెల్​లో తెరకెక్కుతున్న చిత్రం కానుక టైటిల్ అనేది అన్ని భాషలకు తగ్గట్లు ఉండాలని మేకర్స్ భావిస్తున్నారట. దీంతో టైటిల్ మార్చాలని మేకర్స్ నిర్ణయించినట్లు ఇన్​సైట్ టాక్. దీంతో ఈ సినిమాకు 'రాజా సాబ్' అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తోంది. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ టైటిల్ అఫీషియల్​గా అనౌన్స్​ చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

Prabhas Upcoming Films: హీరో ప్రభాస్ వచ్చే ఐదేళ్లు బాగా బిజీగా ఉండే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం నాగ్​ అశ్విన్​తో కలిసి కల్కి '2898 AD' షూటింగ్​లో ఉన్న రెబల్​స్టార్ నెక్ట్స్​ వరుసగా డైరెక్టర్ మారుతితో ఓ సినిమా, ప్రశాంత్​ నీల్​తో 'సలార్' రెండో పార్ట్, సందీప్​రెడ్డి వంగతో 'స్పిరిట్' ఇలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్​లు లైన్​లో ఉన్నాయి. ఈ లెక్కన ప్రభాస్ ఓ ఐదేళ్లు తీరిక లేకుండా గడపనున్నారు.

Salaar Box Office Collection:ఇటీవల రిలీజైన'సలార్' బాక్సాఫీస్ వద్ద మంచి విజయం దక్కించుకుంది. ఇప్పటివరకు వరల్డ్​వైడ్​గా రూ.700 కోట్లు కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాలో శ్రుతిహాసన్, పృథ్వీరాజ్, శ్రేయా రెడ్డి, జగపతిబాబు, ఝాన్సీ, సప్తగిరి తదితరులు ఆయా పాత్రల్లో నటించారు.

ప్రభాస్​ 'కల్కి' - అఫీషియల్​ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్​

'గుంటూరు కారం' ట్విటర్ రివ్యూ : ఎలా ఉందంటే?

Last Updated : Jan 12, 2024, 4:45 PM IST

ABOUT THE AUTHOR

...view details