తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ప్రభాస్​ కొత్త సినిమా కోసం క్రిష్​? - బాహుబలి నిర్మాతలతో ప్రభాస్​ కొత్త సినిమా

ప్రభాస్​తో ఓ సినిమా చేసేందుకు బాహుబలి నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారని ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను దర్శకుడు క్రిష్​తో చేయాలని అనుకుంటున్నారట. ఆ వివరాలు..

Prabhas Krish combination movie wiht Bahubali producers
ప్రభాస్​ కొత్త సినిమా కోసం క్రిష్​?

By

Published : Apr 25, 2023, 7:22 PM IST

'బాహుబలి' సిరీస్​తో పాన్​ ఇండియా స్టార్​గా మారిన రెబల్​ స్టార్ ప్రభాస్.. ఆ తర్వాత సరైన్​ హిట్​ను అందుకోలేకపోయారు. అయినా ఆయన జోరేమీ తగ్గలేదు. డార్లింగ్ చేతిలో 'ఆదిపురుష్', 'సలార్', 'ప్రాజెక్ట్-కే' లాంటి భారీ ప్రాజెక్ట్​లతో పాటు దర్శకులు మారుతి, సందీప్ రెడ్డి వంగతోనూ సినిమాలను కమిట్​య్యారు. వీటిలో నాలుగు చిత్రాల వరకు ఏడాది వ్యవధిలోనే వరుసగా విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణలు జరుపుకుంటున్నాయి.

అయితే ఇప్పుడు ఇవి కాకుండా ప్రభాస్​కు సంబంధించి మరో కొత్త చిత్రం గురించి.. రెండు రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. రీసెంట్​గా 'బాహుబలి' నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు(ఆర్కా మీడియా).. ప్రభాస్​ను కలిసినట్లు వార్తలు వచ్చాయి. వీరి డార్లింగ్​తో ఓ సినిమా కమిటైనట్లు కథనాలు వచ్చాయి. ఒకవేళ 'బాహుబలి 3' కోసం కలిశారా అనే మాటలు కూడా వినిపించాయి. కానీ ఆ డిస్కషన్స్​లో రాజమౌళి లేరు. అలాగే ఆయన సమీప భవిష్యత్తులో బాహుబలి 3 చేసే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఎందుకంటే జక్కన్న ప్రస్తుతం మహేశ్​తో ఓ భారీ అడ్వెంచర్​ సినిమా చేయబోతున్నారు. అది పూర్తయ్యే సరికి మరో మూడేళ్లు పట్టొచ్చు. కాబట్టి జక్కన్నతో సినిమా చేయాలంటే చాలా కాలం ఆగాల్సిందే. దీంతో ప్రభాస్- బాహుబలి నిర్మాతల​ కొత్త చిత్రానికి దర్శకుడు ఎవరై ఉంటారా? అసలు సినిమా ఓకే అయిందా లేదా అనేది ఫ్యాన్స్​లో ఉత్కంఠ కొనసాగుతోంది.

అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఆర్కా మీడియా వారి దృష్టిలో ఓ దర్శకుడు ఉన్నారని తెలిసింది. విలక్షణ దర్శకుడు క్రిష్‌తో కలిసి ప్రభాస్ హీరోగా ఓ సినిమా చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే వీరికి క్రిష్‌తో మంచి అనుబంధం ఉంది. గతంలో అల్లుఅర్జున్​ 'వేదం' సినిమాకు శోభు, ప్రసాద్ నిర్మాణ భాగస్వాములుగా కూడా వ్యవహరించారు. అందుకే వారు క్రిష్‌తో కలిసి ఓ కథ కోసం కొంతకాలంగా చర్చలు జరుపుతున్నారట. అయితే ఆ స్టోరీ ఓ కొలిక్కి రాలేదు కానీ.. ఈలోగా ప్రభాస్​ను కలిసి డేట్స్​ ఇచ్చేలా కమిట్​ చేయాలని ప్రయత్నిస్తున్నారట. ఎలాగైనా కథను వర్కౌట్​ చేసి ప్రభాస్-క్రిష్ కాంబినేషన్లో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం క్రిష్ కూడా.. పవన్ కళ్యాణ్‌తో కలిసి భారీ బడ్జెట్​లో 'హరిహర వీరమల్లు' మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం తీసిన అనుభవంతో.. ప్రభాస్‌తోనూ ఓ చారిత్రక నేపథ్యం ఉన్న కథను తెరకెక్కించాలని అనుకుంటున్నారట. అంతా అనుకున్నట్లు జరిగితే వీరి కాంబోలో ఓ మెగా ప్రాజెక్ట్ వచ్చే అవకాశముంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

ఇదీ చూడండి:అమెరికాలో హీరోయిన్​ లయ ఏం పని చేస్తుందో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details