తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ప్రభాస్, దుల్కర్, నాని ఒకే ఫ్రేమ్​లో.. 'కేజీయఫ్​' దర్శకుడితో..! - vyjayanthi movies dulquer

టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్​ స్టార్ హీరోలందరూ ఒకే ఫ్రేమ్​లో దర్శనమిస్తే ఎలా ఉంటుంది? అభిమానులకు కన్నులపండుగే కదా! అలాంటి అరుదైన చిత్రమే చోటుచేసుకుంది. పాన్​ఇండియా స్టార్ ప్రభాస్, బిగ్​బీ అమితాబ్​ బచ్చన్, మలయాళ సూపర్​స్టార్ దుల్కర్ సల్మాన్, నేచురల్ స్టార్ నాని.. ఇటీవలే ఒకే చోట కలిశారు. అందుకు సంబంధించిన ఫొటో క్షణాల్లో వైరల్​గా మారింది.

prabhas
vyjayanthi movies

By

Published : Jun 27, 2022, 9:47 AM IST

ఇండియన్ సూపర్​స్టార్​లందరూ ఒకే చోట దర్శనమివ్వడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలాంటి సంఘటన హైదరాబద్​లో జరిగింది. అయితే అది ఏ సినిమా వేడుకో కాదు. హైదరాబాద్​లోని గచ్చిబౌలిలో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్​ కొత్త కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ విశేషం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్టార్ హీరోలు ప్రభాస్, బిగ్​బీ అమితాబ్ బచ్చన్, నాని, దుల్కర్ సల్మాన్ హాజరై సందడి చేశారు.

ప్రభాస్, ప్రశాంత్ నీల్, బిగ్​బీ, రాఘవేంద్ర రావు, నాని, దుల్కర్, నాగ్ అశ్విన్

హీరోలతో పాటే దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. వైజయంతీ బ్యానర్​లోనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ 'ప్రాజెక్ట్ కే' చేస్తున్నారు. ఇందులో అమితాబ్, దీపికా పదుకొణె ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్​ షెడ్యూల్​ పూర్తి చేసుకుంది ఈ సినిమా. ఇక ఇదే నిర్మాణ సంస్థలో దుల్కర్​.. 'సీతారామం' అనే సినిమా చేస్తున్నారు. హను రాఘవపూడి దర్శకుడు.

ఇదీ చూడండి:పవన్​, బన్నీ, తారక్​.. ఎందుకు ఇన్ని డౌట్లు పెడుతున్నారు?

ABOUT THE AUTHOR

...view details