తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్​తో ప్రభాస్ సినిమా కన్ఫామ్.. హైఓల్టేజ్ యాక్షన్​కు గెట్​ రెడీ! - ప్రభాస్ కొత్త మూవీ

డార్లింగ్ ప్రభాస్ మరో చిత్రానికి ఓకే చేశారు. బాలీవుడ్ స్టార్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్​తో ఆయన ఓ సినిమా చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మైత్రీ మూవీస్ అధినేత నవీన్ యెర్నేని.

Prabhas Bollywood movie
Prabhas Bollywood movie

By

Published : Jan 14, 2023, 4:26 PM IST

మోస్ట్ అవెయిటెడ్ పాన్-ఇండియా చిత్రాల లైనప్​తో బాక్సాఫీస్​పై దండయాత్రకు సిద్ధంగా ఉన్నారు డార్లింగ్ ప్రభాస్. స్టార్ డైరెక్టర్లతో వరుసపెట్టి సినిమాలు అనౌన్స్ చేశారు. పౌరాణిక నేపథ్యంలో ఆదిపురుష్​ సినిమాను ఇప్పటికే పూర్తి చేశారు. ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. దీంతో పాటు సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు షూటింగ్​ పూర్తి చేసుకుంటున్నాయి. మారుతి దర్శకత్వంలో కామెడీ నేపథ్యంలో పక్కా కమర్షియల్ సినిమాకూ డార్లింగ్ ఓకే చెప్పారు. ఇక సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' చిత్రాన్ని ఎప్పుడో ప్రకటించేశారు. తాజాగా మరో చిత్రానికీ ప్రభాస్ పచ్చజెండా ఊపారు. ఈసారి డైరెక్ట్ బాలీవుడ్ సినిమాను తీసేందుకు సిద్ధమయ్యారు.

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్​తో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నారట. చాలా రోజుల నుంచి ఈ విషయం సోషల్ మీడియాలో ప్రచారమవుతూ ఉంది. అయితే, ఇప్పుడు ఈ విషయం అధికారికంగా వెల్లడైంది. మైత్రీ మూవీస్ మేకర్స్ ప్రొడ్యూసర్ నవీన్ యెర్నేని ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అన్​స్టాపబుల్-2కు వచ్చిన ఆయన.. ఈ చిత్రంపై ప్రకటన చేశారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. హైఓల్టేజ్ యాక్షన్​తో షారుక్ ఖాన్​తో పఠాన్ చిత్రాన్ని తీశారు సిద్ధార్థ్ ఆనంద్. ప్రభాస్​తో ఆయన సినిమా ఇంతకుమించి ఉంటుందని ఇప్పటి నుంచే ఊహించుకుంటున్నారు.

ప్రభాస్ అనౌన్స్ చేసిన ప్రాజెక్టులన్నీ పూర్తైన తర్వాత ఈ సినిమా సెట్స్​పైకి వెళ్లే అవకాశం ఉంది. అటు సిద్ధార్థ్ ఆనంద్ ప్రస్తుతం పఠాన్ ప్రమోషన్స్​లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత హృతిక్ రోషన్ హీరోగా ఫైటర్ చిత్రాన్ని తెరకెక్కించాల్సి ఉంది. ఆ సినిమా పూర్తైన తర్వాత ప్రభాస్ చిత్రంపై ఆయన వర్క్ మొదలుపెట్టనున్నట్లు సమాచారం. ఇవన్నీ జరగాలంటే కనీసం 2024 వరకు ఆగాల్సిందేనని తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details