Bro Overseas Market : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ లీడ్ రోల్స్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ 'బ్రో'. కోలీవుడ్‌లో విడుదలై మంచి టాక్ అందుకున్న వినోదయ సీతమ్ అనే సినిమా రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు సముద్రఖని తెరకెక్కించారు. మామా అల్లుళ్ల కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా గురించి అటు మెగ ఫ్యాన్స్‌తో పాటు ఇటు మూవీ లవర్స్ తెగ ఎదురు చూశారు. దీంతో భారీ అంచనాల నడుమ ఈ సినిమా శుక్రవారం అటు ఇండియాతో పాటు ఇటు ఓవర్సీస్ థియేటర్లలో సందడి చేస్తోంది.
ఇక ఓవర్సీస్లో ఈ సినిమాకు భారీగా వసూళ్లు నమోదయ్యాయని టాక్ నడుస్తోంది. పవన్ కల్యాణ్‌కు ఇండియాలోనే కాదు ఓవర్సీస్ మార్కెట్లోనూ మంచి పేరు ఉంది. అక్కడ కూడా పవన్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే 'బ్రో' సినిమా ఓవర్సీస్ ప్రీమియర్ సేల్స్ కూడా ఓ రేంజ్లో జరిగాయని టాక్. అయితే తాజాగా వెలువడిన సమాచారం ప్రకారం శుక్రవారం ఉదయం 4.30 గంటల వరకు ఓవర్సీస్ వసూళ్ల వివరాలను చూస్తే...
నార్త్ అమెరికాలో సుమారు 243 లొకేషన్లలో 'బ్రో' సినిమా రిలీజవ్వగా.. దాదాపు 523,169 డాలర్లు వసూలు అయ్యాయని తెలిసింది. యూఎస్‌లో 482,463 డాలర్లు కలెక్ట్ అయ్యాయట. ఇక కెనడాలో 40,706 డాలర్లు వసూలు అయ్యాయని అక్కడి ట్రేడ్ వర్గాల అంచనా.
Bro Movie Openings : మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ పవన్ మూవీకి ఏ మాత్రం జోరు తగ్గలేదు. ఇప్పటికే ప్రీమియర్ షోలతో సందడి చేస్తున్న ఈ సినిమా పాజిటివ్ టాక్ అందుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. అయితే 'బ్రో' సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయని టాక్. ముఖ్యంగా ఆంధ్ర-తెలంగాణలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ప్రీమియర్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో జరిగాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఊహించని రేంజ్లో కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో దాదాపు 700 షోస్‌కి 600 షోల బుక్కింగ్స్ నిండిపోయాయని సమాచారం. ఇక విశాఖలో 290కి ఏకంగా 278 షోస్ నిండిపోవడం విశేషం.
ఇక విజయవాడ 230/230, కాకినాడ 76/80, గుంటూరు 120/135, తిరుపతి 48/53, రాజమండ్రి 52/52, నెల్లూరు 60/62 షోస్ ఫిల్ అయ్యాయని టాక్. అయితే ఇతర పెద్ద నగరాలతో పోలిస్తే.. హైదరాబాద్‌లో బుక్కింగ్స్ కాస్త తక్కువ అయినట్లు అనిపిస్తోందట. ఏదేమైనా ఈ లెక్కన చూస్తే ఓపెనింగ్స్ వసూళ్లు రికార్డులు అదిరిపోయేలా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు జోస్యం పలుకుతున్నాయి.