'గబ్బర్‌సింగ్' తర్వాత పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ - దర్శకుడు హరీశ్ శంకర్ కాంబోలో రూపొందుతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్‌సింగ్'. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. పవన్‌కల్యాణ్‌కు హీరోయిన్గా శ్రీలీల నటిస్తున్నారు. గత డిసెంబరులోనే లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం.. తాజాగా షూటింగ్ ప్రారంభించుకుంది. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఆధ్వర్యంలో తీర్చిదిద్దిన పోలీస్ స్టేషన్ సెట్లో షూటింగ్ షురూ అయింది. ఈ షెడ్యూల్‌లోనే పవన్‌కల్యాణ్‌తోపాటు, ఇతర ప్రధాన తారాగణంపై సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. దిల్లీ నుంచి ఇటీవలే హైదరాబాద్‌కు చేరుకున్న పవన్‌కల్యాణ్.. బుధవారం నుంచే ఈ సెట్లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఉస్తాద్ ఊచకోత షురూ అంటూ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది మూవీటీమ్. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
హనుమాన్ పోస్టర్.. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' టీమ్ ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అందులో హనుమాన్ పాత్రధారుడు రాముని జపిస్తూ ధ్యానంలో కనిపించారు. ఇక ఆయన వెనుకల రామునిగా ప్రభాస్ కనిపిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.
'ఆదిపురుష్' హనుమాన్ వచ్చేశాడు సమంత శాకుంతలం..ఇక ఏప్రిల్ 5నహీరోయిన్ సమంత నటించిన శాకుంతలం సినిమా రిలీజ్ ట్రైలర్ కూడా విడుదలై ఆకట్టుకుంది. 'లేడి కన్నులు.. నెమలి నడక.. సివంగి నడుము...' అంటూ హీరో దేవ్ మోహన్ చెప్పే డైలాగ్‌తో ఈ ప్రచార చిత్రం ప్రారంభమైంది. కాగా, సామ్ టైటిల్ రోల్లో నటించిన ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ నెల 14న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది.
రజనీకాంత్-లోకేశ్ కాంబో..సూపర్ స్టార్రజనీకాంత్ ప్రస్తుతం ఫుల్ జోరుగా ఉన్నారు. వరుస సినిమాలను కమిట్ అవుతూ.. షూటింగ్‌లను పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే 'జైలర్' చిత్రంలో కథనాయకుడిగా, 'లాల్‌సలామ్' మూవీలో అతిథి పాత్రలో నటిస్తున్న ఆయన.. రీసెంట్గా 'జై భీమ్' దర్శకుడు టీజే జ్ఞానవేల్‌తో ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా మరో సినిమాకు సైన్ చేయడానికి సిద్ధమవుతున్నారట. ఇటీవలే కమల్‌హాసన్ 'విక్రమ్' సినిమాతో ఫుల్ జోష్‌లో ఉన్న దర్శకుడు లోకేశ్ కనగరాజ్... రజనీకాంత్‌ను కలిసి ఓ కథ వినిపించారని, అది రజనీకాంత్‌కు నచ్చిందని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ చిత్రాన్ని కమల్‌హాసన్ నిర్మించబోతున్నారని సమాచారం అందుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..
రజనీకాంత్ లోకేశ్ కనగరాజ్
ఇదీ చూడండి:హీరో రాజశేఖర్ లవ్ స్టోరీ.. 'పెళ్లి చేసుకోకపోయినా ఆమె నాతోనే ఉంటానంది'