తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'వీరమల్లు' విషయంలో సైలెంట్​గా పవన్​ ఫ్యాన్స్! - హరిహర వీరమల్లు రిలీజ్ డేట్​

క్రిష్ దర్శకత్వంలో పవర్​స్టార్​ పవన్ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'హరిహర వీరమల్లు'. ఈ చిత్ర విషయంలో.. పవన్​ ఫ్యాన్స్ కాస్త సైలెంట్​గా ఉన్నట్లు కనిపిస్తోంది! ఆ వివరాలు..

Hari hara veera mallu
పవన్​ 'వీరమల్లు' విషయంలో సైలెంట్​గా ఫ్యాన్స్!

By

Published : Apr 24, 2023, 5:12 PM IST

క్రిష్ దర్శకత్వంలో పవర్​స్టార్​ పవన్ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'హరిహర వీరమల్లు'. చారిత్రక కథాంశంతో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్​పై ఏఎం రత్నం సమర్పిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్​. బాలీవుడ్ స్టార్​ యాక్టర్​ బాబీ డియోల్​ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్​.. ఇదివరకు ఎప్పుడూ కనిపించని విధంగా కనిపించనున్నారు. 17వ శతాబ్దం నాటి కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రకటించి, సెట్స్​పైకి దాదాపు రెండేళ్లు అయిపోతోంది. అయినా ఈ చిత్రం ఇంకా పూర్తి కాలేదు.

వాస్తవానికి ఈ చిత్రాన్ని గతేడాదే విడుదల చేస్తామని అన్నారు. ఆ తర్వాత.. ఈ ఏడాది సంక్రాంతి బరిలో అని కూడా అన్నారు. ఇప్పుడు వేసవి కాలం కూడా వచ్చేసింది. కానీ రిలీజ్​పై సరైనా క్లారిటీ రావట్లేదు. ఇప్పుడేమో ఈ దసరా లేదా వచ్చే సంక్రాంతి అని కూడా వినిపిస్తోంది. ఏదేమైనప్పటికీ షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే సాధరణంగానే పవన్ సినిమా అంటే అభిమానుల్లో ఫుల్ జోష్ ఉంటుంది. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా? అప్డేట్స్​ చెప్పడంటూ తెగ ఎదురుచూస్తుంటారు. అయితే వీరమల్లు సినిమాల్లో ప్రస్తుతం ఇది కాస్త మిస్ అయినట్టు కనిపిస్తోంది!

పవన్​.. వీరమల్లుతో పాటు హరీశ్​ శంకర్ డైరెక్షన్​లో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నారు. అయితే సినిమా ప్రకటించిన కూడా చాలా కాలమైంది. రీసెంట్​గా సెట్స్​పైకి వెళ్లింది. అయితే ఆ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్.. ఎప్పటికప్పుడు హడావుడి చేస్తూనే ఉన్నారు. కానీ వీరమల్లు సినిమా గురించి మాత్రం పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతగా పట్టించుకోవట్లేదనిపిస్తోంది. సినిమా ప్రకటించిన మొదట్లో ఫుల్​ జోష్​లో ఉన్న అభిమానులు.. ఇప్పుడు మాత్రం ఆ చిత్రం విషయంలో కొంచెం సైలెంట్​గానే ఉన్నారు. క్రిష్​ను టార్గెట్ చేస్తూ.. అప్డేట్స్ అడగడం అంతగా చేయట్లేదు! భారీ బడ్జెట్​ సినిమా కదా అని సమయం పట్టొచ్చు అని ఆలోచించి సైలెంట్​గా ఉన్నారేమో అనిపిస్తోంది. అసలే పవన్​.. మరోవైపు పొలిటికల్​గా కూడా ఫుల్​ బిజీగా ఉండటం వల్ల డేట్స్ అడ్జెస్ట్ కూడా కాస్త కష్టం అవుతోంది. అందుకే ఇదంతా ఆలోచించి వీరమల్లు విషయంలో ఫ్యాన్స్ కాస్త తగ్గి ఉండొచ్చు.

ఏదేమైనప్పటికీ మాత్రం హరీశ్​ శంకర్ సినిమాతో పోలిస్తే వీరమల్లు విషయంలో మాత్రం తక్కువ అటెన్షన్ చూపిస్తున్నారు! ఉస్తాద్​పై భారీ ఆశలు పెట్టుకున్నారు. చూడాలి మరి వాయిదా పడుతూ వస్తున్న హరిహర వీరమల్లు రిజల్ట్​ ఏలా ఉంటుందో. ఇకపోతే ఈ సినిమాలో పవన్​ ఓ పాట కూడా పాడనున్నట్లు తెలిసింది.

ఇదీ చూడండి:వరల్డ్​ లార్జెస్ట్​ స్క్రీన్​లో తారక్ సినిమా రీరిలీజ్​.. నిమిషాల వ్యవధిలో బుకింగ్స్​ ​ఓవర్..

ABOUT THE AUTHOR

...view details