Pawan Kalyan Upcoming Projects : ఇటీవలే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'బ్రో' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన చేతిలో క్రిష్ 'హరి హర వీరమల్లు', హరీష్ శంకర్ 'ఉస్తాద్ భగత్ సింగ్', సుజీత్ 'ఓజీ - ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్' ఉన్నాయి. అయితే ఈ చిత్రాల విషయంలో మళ్లీ కన్ఫూజన్ మొదలైంది. మొన్నటి వరకు పాలిటిక్స్ షెడ్యూల్ వల్ల ఈ చిత్రాలు ఆగిపోయినట్టు ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత పవన్ మనసు మార్చుకుని ఈ చిత్రాల షూటింగ్‌ను మొదలుపెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఉస్తాద్‌ను సంక్రాంతికి(pawan kalyan ustaad bhagat singh), ఓజీని డిసెంబర్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఇన్సైడ్ టాక్ వినిపించింది.
అయితే ఇప్పుడు ఈ రెండు చిత్రాలు డిసెంబర్, జనవరిలో రిలీజ్ కావని, అప్పటికల్లా సిద్ధం చేయడం కష్టమని తెలిసింది. కానీ షూటింగ్ మాత్రం మొదలు పెట్టాలని అనుకంటున్నారు. రాబోయే రెండు మూడు నెల్లలో చిత్రీకరణ ప్రారంభించి కొనసాగిస్తారని తెలిసింది. దీనివల్ల ఈ ఇద్దరు దర్శకులు సినిమాను మరింత క్వాలిటీగా తీర్చిదిద్దేందుకు మరింత సమయం దొరికినట్టైంది.
Pawan Kalyan OG Movie : పవన్ తొలిసారి... పవన్ రీఎంట్రీ ఇచ్చాక ఇప్పటివరకు వకీల్‌సాబ్, భీమ్లానాయక్, బ్రో సినిమాలను చేశారు. వీటిలో ఏదీ కూడా ఫారెన్ షెడ్యూల్‌ను జరుపుకోలేదు. అన్నీ లకల్గానే చేశారు. అయితే ఇప్పుడు ఓజీ కోసం ఫారెన్ షెడ్యూల్ చేయబోతున్నారని తెలిసింది. మొన్నటివరకు ముంబయిలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం.. అక్టోబర్‌లో మాత్రం థాయ్‌లాండ్‌లో చిత్రీకరణ జరుపుకునేందుకు సిద్ధమైందని తెలిసింది. 30 రోజులు పాటు ఈ షెడ్యూల్ ఫారెన్‌లో కొనసాగనుందని తెలిసింది. దీని కోసం పవన్ థాయ్‌లాండ్ వెళ్లనున్నారని తెలిసింది.
మరో వార్త ఏంటంటే.. ఈ చిత్రంలో పవర్ ఫుల్ ఇంట్రోను ప్లాన్ చేశారని తెలిసింది. రెండు పవర్ఫుల్ ఇంట్రో సీన్స్‌ను దర్శకుడు సుజీత్ డిజైన్ చేశారట. అయితే ఆ రెండింలో పవన్.. 15నిమిషాల హై ఓల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ ఎంట్రీ సీన్‌ను గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఇది అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందట. ఇప్పటి వరకు పవన్ కెరీర్లోనే బెస్ట్ ఇంట్రడక్షన్ ఇంట్రో యాక్షన్ సీక్వెన్స్‌గా చిత్రీకరించనున్నారని తెలిసింది. ఇక ఈ సినిమాకు తమన్ అందించబోయే సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలవనుందట.