తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పవన్ కల్యాణ్ ఇండస్ట్రీలోకి వచ్చి 26 ఏళ్లు.. కానీ వాళ్లు గుర్తుపట్టలేదు! - పవన్ కల్యాణ్ కొత్త సినిమాలు

పవన్‌ కల్యాణ్‌ అంటే పేరు కాదు అది ఒక బ్రాండ్‌ అన్నంతగా అభిమానులను సంపాదించుకున్నారు పవర్​స్టార్. ఆయనకు అభిమానులతో పాటు భక్తులు కూడా ఉంటారు. పవన్‌కు జనాల్లో అంత క్రేజ్‌ ఉంది. మరి అలాంటి పవన్‌ను ఆ ప్రాంత వాసులు గుర్తుపట్టలేదట!

pawan kalyan completes 26 years in TFI
pawan kalyan completes 26 years in TFI

By

Published : Oct 11, 2022, 10:57 PM IST

2011లో పవన్‌ కల్యాణ్‌ 'పంజా' సినిమా షూటింగ్‌ సమయంలో కలకత్తా వెళ్లారట! దాదాపు రెండు నెలలు అక్కడే ఉండి రద్దీగా ఉండే ప్రాంతాల్లో షూటింగ్‌ చేశారు. ఆసక్తికర విషయమేమిటంటే అంత రద్దీగా ఉన్న ప్రాంతంలోనూ పవన్‌ను ఎవరూ గుర్తుపట్టకపోవడం. అక్కడ పవన్‌ రోడ్డుపై తిరుగుతూ షాపింగ్‌ కూడా చేశారట. అప్పట్లో ఇంటర్నెట్ అందరికీ ఇంతగా అందుబాటులో లేదు కాబట్టి పవన్‌ అలా ఓ స్వేచ్ఛగా తిరిగారని అభిమానులు చెబుతున్నారు. అది కూడా నిజమే కదా మరీ. ఇక సినిమాల విషయానికొస్తే పవన్‌కల్యాణ్‌ ప్రస్తుతం క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు'లో నటిస్తున్నారు. ఇది పవన్‌కు తొలి పాన్‌ ఇండియా చిత్రం కానుంది. ఇప్పటికే కొంతభాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఫొటోలు నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

పవన్​ కల్యాణ్​ ఇండస్ట్రీలోకి వచ్చి 26 ఏళ్లు పూర్తైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. కర్ణాటకలోనూ పవన్​ మేనియా కొనసాగింది. అభిమానులు భారీగా థియేటర్లకు తరలివచ్చి.. పవర్ స్టార్ పాత సినిమాలను, స్పెషల్​ షోలు చూశారు. దేశంలో మోస్ట్​ సెలెబ్రేటెడ్ హీరోగా పేరు సంపాదించుకున్న పవన్​ కల్యాణ్.. క్రేజీ ప్రాజెక్టులతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే 'హరిహర వీరమల్లు' మరో షెడ్యూల్​ను ప్రారంభించనున్నారు. మరో పక్క తనకు ఇండస్ట్రీ హిట్​ ఇచ్చిన హరీష్ శంకర్​ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్​ సింగ్' సినిమాను చేస్తున్నారు పవన్ కల్యాణ్.

ABOUT THE AUTHOR

...view details