తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Pawan Kalyan OG Cast : 'ఓజీ'లోకి మరో సీనియర్​ హీరో.. అప్పుడు అన్నయ్యతో ఇప్పుడు తమ్ముడితో.. - పవన్​ కల్యాణ్ ఓజీ మూవీ లేటెస్ట్ అప్​డేట్స్

Pawan Kalyan OG Cast : పవర్ స్టార్​ పవన్​ కల్యాణ్, సుజీత్​ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'ఓజీ'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్​ దశలో ఉంది. అయితే ఈ చిత్రంలో ఓ సీనియర్​ హీరో నటించనున్నారట. ఇంతకీ ఆయన ఎవరంటే..

Pawan Kalyan OG Cast
Pawan Kalyan OG Cast

By ETV Bharat Telugu Team

Published : Oct 29, 2023, 7:39 PM IST

Pawan Kalyan OG Cast : పవర్​ స్టార్ పవన్​ కల్యాణ్​ ప్రస్తుతం బ్యాక్​ టు బ్యాట్​ షూటింగ్​ షెడ్యూళ్లతో బిజీగా ఉన్నారు. 'బ్రో' సినిమా తర్వాత 'హరిహర వీర మల్లు', 'ఉస్తాద్ భగత్ సింగ్​' సినిమాల్లో నటిస్తున్న ఆయన.. దీంతో పాటు సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఓజీ' షూటింగ్​లోనూ పాల్గొంటున్నారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం వరుస షెడ్యూళ్లను కంప్లీట్​ చేసుకుంటూ వస్తోంది. ఇప్పటికే 'హంగ్రీ చీతా' అనే పేరుతో విడుదలైన ఓ గ్లింప్స్ నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది. మ్యూజిక్​, విజువల్స్​, పవన్ యాక్షన్​.. ఇలా అన్ని ఎలిమెంట్స్​తో రూపుదిద్దుకున్న ఆ వీడియోను చూసిన ఫ్యాన్స్​ ఆనందం అంతా ఇంతా కాదు.

ఇక గ్లింప్స్​తో పాటు ఈ సినిమాలోని పాత్రలు కూడా ఈ చిత్రంపై హైప్​ అమాంతం పెంచేస్తోంది. అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి లాంటి స్టార్స్ పేర్లు తెరపైకి రాగా.. ఇప్పుడు ఆ జాబితాలోకి సీనియర్ యాక్టర్‌ వెంకట్‌ పేరు వచ్చింది. 'అన్నయ్య' సినిమాలో మెగాస్టార్​ చిరంజీవికి తమ్ముడిగా నటించి ప్రేక్షకులకు ఈయన మరింత చేరువయ్యారు.

90స్​ దశకంలో మంచి రోల్స్ చేసిన ఈ స్టార్​..'శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి', 'అన్నయ్య' సినిమాల్లో తన నటనకు మంచి గుర్తింపు పొందారు. అయితే కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ నటుడు.. మళ్లీ ఇప్పుడు 'ఓజీ' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంతే కాకుండా 'ఓజీ'లో తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ పూర్తయిందని తెలిపారు. అంతే కాకుండా ఈ సినిమా గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు.

"సినిమా గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఓజీ హై టెక్నికల్‌ వాల్యూస్‌తో భారీ స్థాయిలో వస్తోంది. టాలెంటెడ్‌ యాక్టర్లు భాగస్వామ్యమైన ఓజీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి రాబోతున్న మరో భారీ సినిమా కానుంది. గ్లింప్స్‌లో పవన్‌ కల్యాణ్‌ అదరగొట్టేశారు. విజువల్స్‌ ఔరా అనిపించేలా ఉన్నాయి" అని వెంకట్​ చెప్పుకొచ్చారు.

Pawan Kalyan Italy Tour :మరోవైపు పవన్‌ కల్యాణ్‌ తాజాగా కుటుంబసమేతంగా ఇటలీకి బయల్దేరారు. వరుణ్​- లావణ్య పెళ్లి సందర్భంగా ఆయన తన సతీమణితో కలిసి హైదరాబాద్​ విమానాశ్రయంలో కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

OG - Gunturu Karam - Devara Updates : దసరా స్పెషల్​.. పవన్-మహేశ్​-ఎన్టీఆర్ నుంచి అదిరిపోయే అప్డేట్స్

Pawan Kalyan Upcoming Projects : పవన్ ఫ్యాన్స్​.. వీటిపై అస్సలు ఆశలు పెట్టుకోవద్దు.. డౌటే!

ABOUT THE AUTHOR

...view details