Ustaad Bhagat Singh : పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 'భవదీయుడు భగత్‌సింగ్' అంటూ ఇప్పటికే టైటిల్‌తో పాటు, పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. గతకొంతకాలంగా ఈ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ లేదు. ఈ క్రమంలో ఈ మూవీ టైటిల్‌ను మార్పు చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. దీనికి 'ఉస్తాద్ భగత్‌సింగ్' అంటూ కొత్త టైటిల్, పోస్టర్‌ను విడుదల చేశారు. 'మనల్ని ఎవడ్రా ఆపేది' అనే ట్యాగ్ లైన్‌తో పాటు, ఈ సారి కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు అనే మూవీ థీమ్‌లైన్ కూడా ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
'మనల్ని ఎవడ్రా ఆపేది'.. పవన్- హరీశ్ సినిమాకు కొత్త టైటిల్.. అదిరే పోస్టర్! - పవన్ కల్యాణ్ సినిమాలు
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రానికి టైటిల్‌ను ఖరారు చేసినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను సైతం విడుదల చేసింది.
తాజా చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, అయాంక్ బోస్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇక ఈ సినిమా కోసం సీనియర్ దర్శకుడు దశరథ్ స్క్రిప్ట్ వర్క్‌లో పనిచేస్తున్నట్లు హరీశ్ శంకర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇది తమిళ చిత్రం 'తెరి' రీమేక్ అని ప్రచారం సాగుతోంది.
ఈ క్రమంలో ఇటీవల హరీష్‌శంకర్ తన సినిమా గురించి ట్వీట్ చేయగానే, 'రీమేక్ వద్దు' అంటూ అభిమానులు పెద్దఎత్తున ప్రతిస్పందించారు. 'మాకు తెరి రీమేక్ వద్దు' అనే ట్యాగ్ ట్రెండింగ్ కూడా అయ్యింది. పవన్‌కల్యాణ్ కోసం హరీష్ శంకర్ కొత్త కథనే సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. 'తేరి' కథను పూర్తిగా కొత్తగా తీస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. అసలు విషయం తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!