వైవిధ్యమైన పాత్రలతో నటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నిత్యా మేనన్. ఈ మలయాళీ ముద్దుగుమ్మ దక్షిణాది చిత్రసీమలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండే ఈ అమ్మడు తాజాగా చేసిన లేటెస్ట్ పోస్ట్ తన ఫాలోవర్స్, నెటిజన్స్‌ను కన్‌ఫ్యూజన్‌లో పడేసింది.
నటి నిత్యామేనన్ ప్రెగ్నెంట్ పోస్ట్.. గందరగోళంలో ఫ్యాన్స్ - Nithya Menen Parvathy film with Anjali Menon
ప్రముఖ నటి నిత్యా మేనన్ ప్రెగ్నేన్సీ టెస్ట్ కిట్ ఫోటోతో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌తో ఆమె ఫాలోవర్స్, నెటిజన్స్‌ను కన్‌ఫ్యూజన్‌లో పడిపోయారు.
ఇంతకీ ఆమె చేసిన పోస్ట్ ఏంటంటే.. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసిన కిట్. దీంతో పాటు వండర్ బిగిన్స్ అనే క్యాప్షన్ కూడా జోడించింది. దీంతో అందరిలోనూ అనుమానాలను రేకెత్తాయి. అసలు నిత్యామేనన్‌కి ఇంత వరకు పెళ్లి కాలేదు కదా.. ప్రెగ్నెన్సీ ఏంటనే ప్రశ్నలు కూడా కొంతమంది మనసులో మెదిలాయి. మరోవైపు ఇంకో మలయాళ నటి పార్వతి తిర్వోతు కూడా ఇదే ఫొటోను పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు.. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా లేదా ఏదైనా యాడ్ కోసమో అని కామెంట్లు చేస్తున్నారు. బహుశా.. వీరిద్దరు తమ నెక్స్ట్ ఫిల్మ్‌లో గర్భవతిగా కనిపిస్తారేమో అని అంటున్నారు. త్వరలోనే ఆమె దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశముంది.