79 ఏళ్ల వయసులో తాను మళ్లీ తండ్రి అయినట్లు ప్రకటించి సర్ప్రైజ్ ఇచ్చారు ఆస్కార్ విజేత, హాలీవుడ్ హీరో రాబర్ట్ డి నరో. తనకు ఏడో సంతానం కలిగిందని తెలిపారు. రీసెంట్గా తాను నటించిన "అబౌట్ మై ఫాదర్" సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ విషయాన్ని తెలిపారు. 'అబౌట్ మై ఫాదర్' మే 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో యూఎస్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వూలో.. తండ్రి-పిల్లల అనుబంధం గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే తనకు ఇటీవలే ఏడో సంతానం కలిగిందని వెల్లడించారు. ఇంటర్వూ చేస్తున్న వ్యక్తి 'మీకు ఆరుగురు పిల్లలు కదా' అని అడగగా.. ఆరు కాదు ఏడు అని చెప్పుకొచ్చారు. ఇటీవలే తాను ఏడోసారి తండ్రి అయినట్లు, తనకు కొడుకు పుట్టినట్లు తెలిపారు. మిగతా వివరాలు ఏమీ చెప్పలేదు.
ఆస్కార్ విన్నర్.. ఏడు పదుల వయసులో ఏడో సంతానం - actor Robert De Niro 7th child
ఆయన ఓ స్టార్ హీరో. దాదాపు 58 ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ప్రతిష్టాత్మక ఆస్కార్‌ను కూడా గెలుచుకున్నారు. ఇప్పటికే ఆరుగులు పిల్లలు ఉన్నారు. అయితే తాజాగా ఆయన మరో బిడ్డకు తండ్రి అయ్యారు. అది కూడా 79ఏళ్ల వయసులో. ఇంతకీ ఆ హీరో ఎవరంటే?
అయితే ఈ ఆస్కార్ అవార్డు విజేత ఇప్పటివరకు రెండు పెళ్లిలు చేసుకున్నారు. ఇంకో మహిళతో రిలేషన్ షిప్లో ఉన్నారు. రాబర్ట్ డి నరో మొదటగా.. డయానా అబాట్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి డ్రెనా (51), రాఫెల్ (46) అనే కూతుకు, కొడుకు ఉన్నారు. 1988 వరకు వీరిద్దరు కలిసి ఉన్నారు. ఆ తర్వాత నటి టౌకీ స్మిత్‌తో రిలేషన్ షిప్లో ఉన్నారు. 1995లో వీరిద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. వీరి పేర్లు జూలియన్(27), అరోన్(27). 1997లో గ్రేస్ హై టవర్‌ను రాబర్ట్ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు కొడుకు ఇల్లియట్ (24), కూతురు హెలెన్ గ్రేస్(11) ఉన్నారు. ఇప్పుడు ఏడో బిడ్డను జన్మనిచ్చారు రాబర్ట్. మరి ఈ సంతానం.. ఎవరితో కలిగిందో వివరాలు చెప్పలేదు.
ఇకపోతే.. పిల్లలు తమ కలలు సాకారం చేసుకోవాలంటే తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్ వారిని ప్రోత్సహించాలి అని డి నరో గతంలో ఓ ఇంటర్వూలో చెప్పారు. "నా పిల్లలతో నేను ఇలా ఎప్పుడు చెబుతుంటాను. మీరు యాక్టర్ అవ్వాలనుకున్నా లేదా ఇంకేమైనా చేయాలనుకున్నా మీ ఇష్టం. మీరు ఆ పని వల్ల సంతోషంగా ఉన్నంత వరకు అది చేయండి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి అని వారితో చెబుతాను" అని డి నరో అన్నారు. "మీ లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నప్పుడు..దేనికీ భయపడకుండా ముందుకెళ్లాలి. మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవటం ముఖ్యం" అని డి నరో చెప్పారు. కాగా, రాబర్ట్ డి నరో నటించిన 'అబౌట్ మై ఫాదర్' సినిమా ఈ నెల 26న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ 12 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.