సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖుల జీవితాల ఆధారంగా ఇప్పటికే వెండితెరపై అనేక సినిమాలు సందడి చేశాయి. ఈ క్రమంలోనే దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ జీవిత కథ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే వివరాలు వెల్లడించిన చిత్రబృందం.. ఆదివారం వాజ్‌పేయీ 98వ జయంతి సందర్భంగా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది.
వాజ్‌పేయీ బర్త్‌డే స్పెషల్.. 'మై అటల్ హూ' ఫస్ట్‌లుక్ రిలీజ్ - మే అటల్ హూ చిత్రం
భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ బయోపిక్కు సంబంధించిన కొత్త అప్డేట్ వచ్చింది. ఆదివారం వాజ్‌పేయీ జయంతి సందర్భంగా చిత్ర నిర్మాతలు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
ఈ సినిమాలో వాజ్‌పేయీ పాత్రను బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి పోషిస్తున్నారు. మహానీయుడి పాత్రను పోషిస్తున్నందుకు తనకెంతో గర్వంగా ఉందని పంకజ్ త్రిపాఠి తెలిపారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు రవి జాదవ్ దర్శకత్వం వహిస్తున్నారు. సమీర్ పాటలను రాయగా.. సలీం సులైమాన్ సంగీతం అందిస్తున్నారు. భానుశాలి స్టూడియోస్ లిమిటెడ్, లెజెండ్ స్టూడియోస్ సమర్పణలో వినోద్ భానుషాలి, సందీప్ సింగ్, సామ్ ఖాన్ కమలేష్ భానుశాలి నిర్మిస్తున్నారు. 2023 డిసెంబర్లో వాజ్‌పేయీ 99వ జయంతి సందర్భంగా థియేటర్లలోకి ఈ చిత్రం రానుంది.