Om Movie Re release : ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. హీరోల పుట్టినరోజులకు వారు నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలను రీరిలీజ్ చేస్తున్నారు. అయితే ఒక సినిమా రీరిలీజ్ మహా అయితే రెండు సార్లు చేస్తారు.. మూడు సార్లు చేస్తారు. కానీ, ఒక్క సినిమాను 550 సార్లు రిలీజ్ చేయడం ఎప్పుడైనా విన్నారా? రిలీజ్ చేసిన ప్రతిసారీ ఆ సినిమా అంతకుమించి హిట్ అందుకోవడం చూశారా? అసలు ఆ సినిమా ఏంటి? ఆ హీరో ఎవరు? అనేది తెలుసుకుందాం.
550 సార్లు రీరిలీజైన ఆ సినిమా పేరు 'ఓం'. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి మరో శాండిల్‌వుడ్ హీరో ఉపేంద్ర దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో శివరాజ్ కుమార్ సరసన ప్రేమ హీరోయిన్గా నటించారు. ఉపేంద్ర సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటుంది. ఆయన జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా 'ఓం' సినిమా తీసినట్లు ఉపేంద్ర తెలిపారు.
'ఓం' మూవీలో శివరాజ్ కుమార్ Om Movie Rerelease Date : ఈ సినిమా మొట్టమొదటిసారి 1995లో రిలీజ్ అయ్యింది. అప్పట్లో ఈ చిత్రం ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. 20 ఏళ్ల కాలంలో ఈ సినిమాను మేకర్స్ 550 సార్లు రీరిలీజ్ చేశారు. ఒక సినిమా ఇలా 550 సార్లు రిలీజ్ చేయడం పెద్ద రికార్డ్.. అందుకే అత్యధిక సార్లు రీరిలీజ్ అయిన మూవీగా ఈ సినిమాకు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కింది.
Om Movie Budget : అయితే ఏ సినిమా అయినా ఏడాదికో, రెండేళ్లకో టీవీలో వస్తుంది.. కానీ ఈ చిత్రం దాదాపు 20 ఏళ్ల వరకు టీవీలో రాలేదు. నిర్మాతలు ఈ సినిమా హక్కులను డిజిటల్‌కు ఇవ్వకుండా రీరిలీజ్‌లు చేస్తూనే ఉన్నారు. కేవలం రూ.70 లక్షలు పెట్టి తీసిన ఈ సినిమా నిర్మాతకు రూ.10 కోట్లు లాభాలను అందించింది. ఈ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా శివరాజ్ కుమార్‌కు, ఉత్తమ నటిగా ప్రేమకు అవార్డులు కూడా వరించాయి.
'ఓం' మూవీలో శివరాజ్ కుమార్, ప్రేమ ఓం సినిమా గురించి పది ఆసక్తికర విషయాలు..
- Om Movie Director : దర్శకుడు ఉపేంద్ర కాలేజ్ చదువుకునే రోజుల్లోనే ఈ కథను రాసుకున్నారు. ఎవరో రాసిన ఓ లెటర్‌ను తన స్నేహితుడు పురుషోత్తం తీసుకురావడంతో కాలేజ్ మొత్తం హాట్‌టాపిక్ అయిందట. ఆ సంఘటనను స్ఫూర్తిగా తీసుకుని 'ఓం' కథలో ఫస్ట్ పార్ట్ రాసుకున్నారు.
- ద్వితీయార్ధానికి వచ్చే సరికి ఆర్గనైజ్డ్ క్రైమ్, మాఫియా బ్యాక్‌డ్రాప్ నుంచి నిజ జీవిత సంఘటనల ఆధారంగా కథను రాసుకుంటే, అప్పటికే విడుదలైన రాంగోపాల్‌వర్మ- నాగార్జున 'శివ' కథకు దగ్గర పోలికలు ఉండటంతో ఉపేంద్ర కాస్త నిరాశ చెందారట. ఆ తర్వాత కొన్ని మార్పులతో ప్రస్తుతం ఉన్న కథను రాసుకున్నారు.
- అండర్‌వరల్డ్‌లో పనిచేసిన అనేక మంది నేరస్థులు/నిందితులు 'ఓం' సినిమాలో నటించారు. కేవలం ఈ సినిమా కోసమే కొందరిని బెయిల్‌పై బయటకు తీసుకొచ్చారు. అంతేకాదు అప్పట్లో పోలీస్ స్టేషన్లో రౌడీషీట్‌లో ఉన్న కృష్ణప్ప, బెక్కిన కన్ను రాజేంద్ర, కోరంగు, తన్వీర్ వంటి వారు కూడా నటించారు.
- ఈ సినిమా విడుదలకు ముందే కర్ణాటకలోనే కాదు.. దేశవ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. 'ది వీక్' మ్యాగజైన్ 'ఓం'పై ఏకంగా కవర్ స్టోరీనే ప్రచురించింది. లెజెండరీ నటుడు రాజ్‌కుమార్ బ్యానర్‌పై ఇలాంటి సినిమాను నిర్మించకుండా ఉండాల్సిందని రాసుకొచ్చింది.
- తొలుత తీసిన 'ఓం' మూవీ క్లైమాక్స్ వెర్షన్‌పై సెన్సార్‌బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. కచ్చితంగా మార్పులు చేస్తేనే ధ్రువీకరణ పత్రం ఇస్తామని చెప్పడంతో అందుకు అనుగుణంగా మార్పులు చేశారు.
- ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ.70లక్షలు. హెచ్డీ కుమారస్వామి పంపిణీ హక్కులను సొంతం చేసుకున్నారు. 1995 మే 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
- 1996 కర్ణాటక స్టేట్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా శివరాజ్‌కుమార్, నటిగా ప్రేమ, ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా ఉపేంద్ర, సినిమాటోగ్రాఫర్‌గా బీసీ గౌరీ శంకర్లు అవార్డులు సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్(సౌత్)ను శివరాజ్‌కుమార్ సొంతం చేసుకున్నారు.
- బెంగళూరులోని కపిల్ థియేటర్లో 'ఓం' చిత్రాన్ని అత్యధికంగా 30సార్లు రీ-రిలీజ్ చేశారు. అదొక రికార్డు.
- సినిమా విడుదలైన 20ఏళ్ల తర్వాత అంటే 2015లో 'ఓం' డిజిటల్ రైట్స్ విక్రయానికి పెట్టగా రూ.10కోట్లకు ఉదయ్ టీవీ కొనుగోలు చేసింది.
- Om Movie Telugu Remake : తెలుగులోనూ 'ఓంకారమ్' పేరుతోనే రాజశేఖర్ కథానాయకుడిగా దీన్ని రీమేక్ చేశారు. అలాగే 'అర్జున్‌పండిట్' పేరుతో సన్నీ దేఓల్, జుహీచావ్లా కీలక పాత్రల్లో హిందీలో రీమేక్ అయింది.