తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బ్రౌనీ 'రైమ్​'తో రామ్ చరణ్,​ ఉపాసన.. న్యూయార్క్​ 'మినట్'​ ఎంజాయ్​ చేస్తున్న ఎన్టీఆర్, ప్రణతి - ఎన్టీఆర్​ ఫొటోలు

ఆర్ఆర్​ఆర్​తో పాన్​ ఇండియా స్టార్లు అయిపోయారు ఎన్టీఆర్, రామ్ చరణ్. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ హీరోలు తమ కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోలు షేర్​ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్​ అవుతున్నాయి.

ntr ram charan vacation photos
ntr ram charan vacation photos

By

Published : Dec 27, 2022, 8:31 PM IST

Updated : Dec 27, 2022, 8:52 PM IST

రామ్​ చరణ్, ఎన్టీఆర్​.. ఆర్ఆర్​ఆర్​ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ స్టార్​ హీరోల యాక్టింగ్​కు పాన్​ ఇండియా ఫిదా అయింది. దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఇంటెలిజెంట్​ స్టోరీ టెల్లింగ్​కు దేశంలోని ప్రేక్షకులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఫ్యాన్స్​ అయిపోయారు. కాగా, ఆర్ఆర్ఆర్​ చిత్రం ఇప్పటి వరకు చాలా ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకుంది. ఇప్పడు ఆస్కార్​ రేసులో కూడా ఉంది. ఈ సినిమా అఖండ విజయం సాధించడం వల్ల.. రామ్​చరణ్, ఎన్టీఆర్​తో సినిమా తీసేందుకు డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరు హీరోలు వరుస సినిమాలకు గ్రీన్​ సిగ్నల్​ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ పాన్​ ఇండియా స్టార్లు పలు చిత్రాల్లో నటిస్తూ తీరిక లేకుండా గడుపుతున్నారు. తాజాగా ఈ అగ్ర కథానాయకులు వారి ఫొటోలను ప్రేక్షకులతో పంచుకున్నారు.

బ్లాక్​ డ్రెస్సులో కపుల్ పోజు.. విత్ బ్రౌన్ 'రైమ్'..
ఉపాసన.. భర్త రామ్ చరణ్​తో కలిసి దిగిన ఫొటోను షేర్​ చేశారు. అందులో రామ్​చరణ్ బ్లాక్​ సూట్​తో స్టైలిష్​ లుక్​లో కనిపిస్తున్నారు. ఉపాసన కూడా మ్యాచింగ్​గా బ్లాక్​ కలర్​తో ఉన్న గౌన్​లో అందంగా ఉన్నారు. అయితే ఆ ఫొటోలో వారి పెంపుడు కుక్క 'రైమ్'ని ఎత్తుకుని ఉపాసన నిలుచున్నారు. ఇంతకుముందు కూడా రామ్​చరణ్ చాలా సార్లు ఈ కుక్క పిల్లతో కనిపించారు.

రామ్ చరణ్,​ ఉపాసన

ఆర్ఆర్​ఆర్ సినిమా ప్రమోషన్స్​కు కూడా ఈ కుక్క పిల్లను తీసుకెళ్లారు​. అయితే ఈ కుక్కపిల్లను వారి కుటంబ సభ్యుల్లో ఒకరిగా చూసుకుంటారట. అందుకే దానికి ఆ ఇంట్లో ప్రత్యేక స్థానం మరి. అదేకాక తరచుగా పెంపుడు జంతువులను ఇంటికి తీసుకొస్తుంటారట రామ్ చరణ్. ఉపాసనకు కూడా జంతువులంటే చాలా ఇష్టమట. ప్రస్తుతం రామ్ చరణ్​ ఆర్​సీ 15 సినిమాలో నటిస్తున్నారు. ఆ తర్వాత జెర్సీ ఫేమ్​ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.

రామ్ చరణ్,​ ఉపాసన

బుల్లి టైగర్స్​ మిస్సింగ్​.. ఎక్కడున్నారు?
ఇక ఎన్టీఆర్​ కుటుంబ సమేతంగా అమెరికా వెకేషన్​కు వెళ్లారు. వెకేషన్​లో భాగంగా న్యూయార్క్​లో పర్యటిస్తున్నారు. ఇటీవల న్యూయార్క్​లోని ఓ ఇండియన్​ రెస్టారెంట్​కు వెళ్లారు ఎన్టీఆర్​. అమెరికాలో భారతీయ వంటలు కావాలంటే బెస్ట్ ఇండియన్​ హోటల్​ ఇదేనని.. ఓ హోటల్​లోని చెఫ్​లతో దిగిన ఫొటోలు షేర్​ చేశారు ఎన్టీఆర్​.

ఎన్టీఆర్, ప్రణతి

ఈ మేరకు న్యూయార్క్​ టైం స్క్వేర్​లో దిగిన ఓ ఫొటోను షేర్​ చేశారు తారక్. దానికి 'న్యూయార్క్​ మినట్​ను ఎంజాయ్​ చేస్తున్నాం' అని రాసుకొచ్చారు. కాగా ఈ పోస్ట్​పై అభిమానులు స్పందించారు. 'మీరు ఇండియాలో ఫ్రీగా ఉండలేరు. ఎందుకంటే మీకు పెద్ద పెద్ద సెలబ్రిటీలే ఫ్యాన్స్​' అని ఓ అభిమాని కామెంట్ చేయగా..'ఈ ఫొటోలో బుల్లి టైగర్లు కనిపించట్లేదు' అంటూ మరో నెటిజన్​ రాసుకొచ్చాడు. కాగా, ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నారు. కేజీఎఫ్​ ఫేమ్ ప్రశాంత్​ నీల్​ దర్శకత్వంలో మరో సినిమాకు ఓకే చెప్పారు.

ఎన్టీఆర్, ప్రణతి
Last Updated : Dec 27, 2022, 8:52 PM IST

ABOUT THE AUTHOR

...view details