ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో పలు భారీ చిత్రాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వీటి కోసం అభిమానులు ఎంతో కాలంగా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ వీటిలో చాలా చిత్రాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఇవన్నీ అత్యంత భారీ బడ్జెట్‌తో భారీ హంగులతో రూపొందుతున్నాయి. వీటిని తెరకెక్కించేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అయితే వీటిలో కొన్ని మాత్రం వచ్చే ఏడాది వేసవికి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వీటిలో ఒకటి పుష్ప 2. ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్-సుకుమార్ కాంబినేషనల్లో రూపొందుతున్న చిత్రమిది. తొలి భాగం దేశవ్యాప్తంగా సూపర్ హిట్ కావడంతో రెండో భాగంగాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ ఇటీవలే షూటింగ్ ప్రారంభించుకుంది. రీసెంట్గా విశాఖపట్నంలో భారీ సెట్స్‌ను తీర్చిదిద్ది.. కథనాయకుడి పరిచయ సన్నివేశాలు, గీతం చిత్రీకరించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ నాటికి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ - దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూ.200కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఆర్సీ 15 ప్రాజెక్ట్‌కు సంబంధించి కచ్చితమైన రిలీజ్ డేట్ బయటకు రావట్లేదు. అసలీ చిత్రాన్ని 2023 వేసవికి విడుదల చేయాలని భావించారు. కానీ ఆ తర్వాత దర్శకుడు శంకర్ ఏకకాలంలో యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్‌తో భారతీయుడు 2 సినిమా కూడా చేస్తుండటం వల్ల.. ఆర్ సీ 15 ఆలస్యమవుతూ వస్తోంది. ఇప్పుడీ చిత్రాన్ని 2024 సమ్మర్‌కు రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.