తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అబ్బో అల్లు అరవింద్​-సుక్కులో ఈ యాంగిల్​ కూడా ఉందా.. యంగ్ బ్యూటీతో కలిసి రచ్చ! - నిఖిల్​ 18 పేజెస్ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్​

ప్రముఖ నిర్మాత అల్లుఅరవింద్​, దర్శకుడు సుకుమార్​ ఓ యంగ్​ బ్యూటీ హీరోయిన్​తో కలిసి చిందులేస్తూ రచ్చ చేశారు. దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మీరూ చూసేయండి..

Nikhil 18 pages movie success celebrations
అనుపమతో కలిసి అల్లుఅరవింద్ సుకుమార్​ చిందులు

By

Published : Dec 26, 2022, 10:07 AM IST

యంగ్​ హీరో నిఖిల్-హీరోయిన్​ అనుపమ జంటగా నటించిన '18 పేజెస్' ఇటీవలే విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో మూవీటీమ్​ సంతోషంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం.. ఈ మూవీ సక్సెస్​ను గ్రాండ్​గా సెలబ్రేషన్స్ చేసుకుంది.

ఈ క్రమంలోనే ఈ పార్టీలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిత్రంలోని 'టైం ఇవ్వు పిల్ల.. కొంచెం టైం ఇవ్వు' అంటూ సాగే పాటకు యంగ్ బ్యూటీ అనుపమతో కలిసి స్టెప్పులేశారు. ఈ ఇద్దరితో పాటు డైరెక్టర్ సుకుమార్ కూడా చిందులేశారు. అలా ఈ ముగ్గురు కలిసి నవ్వులు చిందిస్తూ.. డ్యాన్స్ చేస్తుండగా హీరో నిఖిల్ సెల్ఫీ వీడియో తీశారు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్​స్టాలో పోస్ట్ చేయగా అది వైరల్​గా మారింది. నెటిజన్లు విపరీతంగా లైక్స్, కామెంట్స్​ చేస్తున్నారు.

కాగా, '18 పేజెస్' మూవీకి స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ అందించారు. ఆయన శిష్యుడు సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించగా.. అల్లు అరవింద్ సమర్పించారు. ఇకపోతే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్​కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక అతిథిగా విచ్చేసి సందడి చేశారు. నిఖిల్​పై ప్రశంసలు కురిపించారు.

ఇదీ చూడండి:పవన్​ ఫ్యాన్స్​కు పండగే.. మళ్లీ థియేటర్లలో 'ఖుషి' సందడి.. ట్రైలర్​ రిలీజ్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details