టాలీవుడ్లో రిలీజైన అన్ని టాక్ షోలకు బాప్‌గా నిలుస్తున్న ఎన్బీకే అన్‌స్టాపబుల్-2..ఒక్కో ఎపిసోడ్‌కు సర్ప్రైజింగ్ గెస్ట్‌లను తెస్తూ ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. బాలయ్య ఎనర్జటిక్ హోస్టింగ్‌కు గెస్ట్‌ల అన్‌స్టాపబుల్ ముచ్చట్ల తోడవ్వడం వల్ల ఈ షో మరింత ఉత్సాహంగా సాగుతోంది. ఇప్పటికే రిలీజైన ప్రభాస్ ఎపిసోడ్.. గ్లింప్స్ లెవెల్ నుంచే ఓటీటీని షేక్ చేయగా.. తాజాగా అన్స్టాపబుల్కు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ రానున్నారు అన్న వార్తతో పీఎస్పీకే అభిమానులు ఆనందంతో పొంగిపోయారు. అప్పటి నుంచి ఎపిసోడ్‌కు సంబంధించిన ఒక్కో అప్డేట్ కోసం వేయి కన్నులతో ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవలే వచ్చిన ఓ అప్డేట్తో ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు.
మరో 'అన్‌స్టాపబుల్' ట్విస్ట్.. పవన్ ఎపిసోడ్ ఇప్పుడే కాదంట.. సంక్రాంతికి స్పెషల్ ప్లాన్..! - అన్‌స్టాపబుల్ పవన్ ఎపిసోడ్ రిలీజ్ డేట్
అన్‌స్టాపబుల్ దూసుకెళ్తున్న్ ఎన్బీకే షోలో పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇచ్చారన్న వార్త తెలియగానే ఫ్యాన్స్ ఉత్సాహం రెట్టింపయ్యింది. ప్రభాస్ ఎపిసోడ్ తర్వాత మోస్ట్ అవెయిటింగ్ ఎపిసోడ్‌గా పవన్ ఎపిసోడ్ నిలుస్తున్న సమయంలో ఆహా సంస్థ ఫ్యాన్స్‌కు ఓ షాకింగ్ న్యూస్ ఇచ్చింది. అదేందంటే.
'జనవరి 2023 మన బాలయ్యదే'.. అని ఆహా సంస్థ పోస్ట్ చేసిన ఓ ట్వీట్లో 'అన్‌స్టాపబుల్'లో స్ట్రీమ్ కానున్న అన్ని ఎపిసోడ్ల లిస్ట్ ఉంది. అందులో 'పీఎస్పీకే x ఎన్బీకే' ఎపిసోడ్ కమింగ్ సూన్ అని రాసుంది. అయితే అది ఎప్పుడు అని మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే షెడ్యూల్లో మాత్రం జనవరి 13 వరకు ప్రభాస్ ఎపిసోడ్‌తో పాటు 'వీరసింహారెడ్డి' స్పెషల్ ఎపిసోడ్ గురించి ప్రస్థావించారు. దీంతో జనవరి 13 తర్వాతనే మిగిలిన ఎపిసోడ్స్ వస్తాయని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఏదైమైనప్పటికీ పవన్ ఎపిసోడ్ కొంచం లేట్‌గా వస్తుందన్న వార్తతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.