తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పండంటి కవలలకు తల్లిదండ్రులైన నయనతార, విఘ్నేశ్​ - nayantara twin boys

కోలీవుడ్​ లేడీ సూపర్​స్టార్​ నయనతార తల్లైంది. పండంటి మగ కవలలకు తాము తల్లిదండ్రులయ్యామని నయన్ భర్త విఘ్నేశ్ శివన్ తెలిపారు.

nayanthara-and-vignesh-shivan
nayanthara-and-vignesh-shivan

By

Published : Oct 9, 2022, 7:23 PM IST

Updated : Oct 9, 2022, 7:44 PM IST

కోలీవుడ్​ ట్రెండింగ్​ కపుల్​ నయనతార, విఘ్నేశ్​ శివన్​ శుభవార్త చెప్పారు. పండంటి కవలలకు తల్లిదండ్రులమైనట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. వీరికి అభిమానులు, ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. సరోగసీ పద్ధతిలో వీరు కవలలకు తల్లిదండ్రులైనట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సుమారు ఏడేళ్ల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట కుటుంబసభ్యుల సమక్షంలో మహాబలిపురంలో జూన్‌ 9న పెళ్లి బంధంతో ఏకమయ్యింది.

.
.

మహాబలిపురంలో అంబరాన్ని అంటేలా ఓ సుందరమైన పెళ్లి వేదికలో జరిగిన ఈ కళ్యాణ వేడుక డాక్యుమెంటరీ రూపంలో త్వరలోనే నెట్టింట్లో సందడి చేయనుంది. 'నయనతార: బియాండ్‌ ది ఫెయిరీటేల్' అనే టైటిల్​తో ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్న ఈ డాక్యుమెంటరీ కోసం వేచి చూస్తున్న అభిమానులకు నిజంగా ఈ జంట మంచి న్యూసే చెప్పింది. దసరాకు విడుదలైన 'గాడ్‌ ఫాదర్‌'తో విజయాన్ని అందుకున్న నయన్​. 'కాతువాకుల రెండు కాదల్'’తో ఈ ఏడాది ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు విఘ్నేశ్‌తో తదుపరి అజిత్‌ సరసన ఓ సినిమా చేయనున్నారని ప్రకటించారు..

.
.
Last Updated : Oct 9, 2022, 7:44 PM IST

ABOUT THE AUTHOR

...view details