తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆకట్టుకుంటున్న నాని, ఆమిర్​ 'ఫ్రెండ్​​షిప్ డే'​ పోస్టర్లు.. మీరు చూశారా? - Hello World Webseries Trailer

లేటెస్ట్​ సినీ అప్డేట్లు వచ్చేశాయి. నాని 'దసరా', ఆమిర్​ ఖాన్​ 'లాల్​ సింగ్​ చడ్ఢా' సినిమాల 'ఫ్రెండ్​​షిప్​ డే' స్పెషల్​ పోస్టర్లను రిలీజ్​ చేశారు మేకర్స్​. అవి నెట్టింట సందడి చేస్తున్నాయి. మరోవైపు, సదా-ఆర్యన్​ రాజేశ్​ నటిస్తున్న 'హలో వరల్డ్'​ వెబ్ సిరీస్ ట్రైలర్​ విడుదలైంది.

Etv Bhanani-dasara-movie-new-poster-and-lalsingh-chadda-new-posterrat
Etv Bharatnani-dasara-movie-new-poster-and-lalsingh-chadda-new-poster

By

Published : Aug 7, 2022, 8:36 PM IST

Nani Dasara Movie New Poster: నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'దసరా'. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లక్ష్మీ వెంకటేశ్వర బ్యానర్​పై సుధాకర్​ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు,తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో మూవీపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఆదివారం ఫ్రెండ్ షిప్​ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెట్టింట సందడి చేస్తోంది. బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా, కీర్తి సురేష్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు. సముద్రఖని, పూర్ణ, ప్రకాశ్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, రోషన్ మ్యాథ్యూ, సాయికుమార్, జరీనా వవాబ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

నాని 'దసరా' స్పెషల్​ పోస్టర్​

Lalsingh Chadda New Poster: బాలీవుడ్ స్టార్ ఆమిర్‌ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన 'లాల్ సింగ్ చ‌డ్ఢా' విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అద్వౌత్ చంద‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు. కామెడీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం ఆగ‌స్టు 11న విడ‌ుద‌ల కానుంది. తెలుగులో ఈ సినిమాకి చిరంజీవి స‌మ‌ర్ప‌కుడిగా ఉండ‌టం విశేషం. ప్ర‌స్తుతం చిత్ర బృందం ప్ర‌మోష‌న్‌ల‌లో బిజీగా ఉంది. ఫ్రెండ్‌షిప్ డే సంద‌ర్భంగా మేక‌ర్స్ తాజాగా ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

'లాల్​ సింగ్​ చడ్డా' స్పెషల్​ పోస్టర్​

"మ‌న‌మిద్ద‌రం ఎప్పుడూ క‌లిసే ఉంటాం. నేను బ‌నియ‌న్, నువ్వు చ‌డ్డీలా" అనే కాప్ష‌న్‌తో నాగ‌చైత‌న్య‌, ఆమిర్​ఖాన్‌లు క‌లిసి ఉన్న పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో వీరిద్ద‌రూ ఆర్మీ ట్రైనింగ్‌లో భాగంగా తాడుపై వేలాడుతూ ఒక‌రినొక‌రు చూసుకుంటున్నారు. లేట‌స్ట్‌గా విడుద‌లైన ఈ పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది.

Hello World Webseries Trailer: సదా, ఆర్యన్‌ రాజేశ్‌ ప్రధాన పాత్రలుగా సిద్ధమైన వెబ్‌సిరీస్‌ 'హలో వరల్డ్‌'. ఫన్‌, యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్​ ఆదివారం విడుదలైంది. ఆగస్టు 12 నుంచి జీ5 వేదికగా ఈ వెబ్​ సిరీస్​ ప్రేక్షకుల ముందుకు రానుంది. సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి కొత్తగా అడుగుపెట్టిన యువతీ యువకుల మధ్య ఉండే స్నేహం, ప్రేమ వంటి అనుబంధాలతో నేటితరం యువతను ఆకట్టుకునేలా దీన్ని సిద్ధం చేశారు. పింక్‌ ఎలిఫెంట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నటి నిహారిక దీన్ని నిర్మించారు.

Manchu Vishnu Daughters Song: మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానాలను సింగర్​లుగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం 'జిన్నా'. విష్ణు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం కోసం సంగీత దర్శకుడు అనూప్.. స్నేహంపై ప్రత్యేక పాటను రూపొందించారు. ఈ పాటను ప్రముఖ గేయ రచయిత భాస్కరభట్ల రచించగా అరియానా, వివియానా ఆలపించారు. ఇటీవలే విడుదలైన ఈ పాటకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది. అరియానా, వివియానాలకు చక్కగా పాడారంటూ ప్రశంసించారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా చిత్ర బృందం.. ఈ పాట చిత్రీకరణ దృశ్యాలను అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో మోహన్ బాబు దగ్గరుండి అరియానా, వివియానాలకు మేకప్ వేయడం, సూచనలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇవీ చదవండి:'అందుకు నేను పదేళ్లు కష్టపడ్డా.. తనకు మాత్రం 'ఊ అంటావా'తో ఫుల్​ క్రేజ్​'

బన్నీ​ వైఫ్ క్రేజీ​ ఫొటోషూట్​.. నిహారిక, సుస్మిత 'హాట్' కామెంట్స్

ABOUT THE AUTHOR

...view details