తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఆ విషయాన్ని 'థ్యాంక్‌ యూ' స్క్రిప్ట్​ గుర్తుచేసింది' - నాగచైతన్య థ్యాంక్యూ మూవీ డైరెక్టర్​

Nagachaitanya Thanku movie: "తినడం, సోషల్‌ మీడియా వాడటం.. లాక్‌డౌన్‌లో ఇదే పని. ఆర్నెల్లు అలానే గడిచిపోయింది. వెనక్కి తిరిగి చూస్తే నేర్చుకుంది ఏం లేదు. సోషల్‌ మీడియా మంచి సాధనమే అయినా అదే జీవితం కాకూడదనే విషయం నాకప్పుడు అర్థమైంది" అని అన్నారు హీరో నాగచైతన్య. ఇంకా పలు విషయాలను తెలిపారు. ఆ సంగతులివీ..

thanku rasikhanna
థ్యాంక్యూ రాశీఖన్నా

By

Published : Jul 18, 2022, 9:34 PM IST

Nagachaitanya Thanku movie: 'థ్యాంక్‌ యూ' సినిమా ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో నాగచైతన్య, హీరోయిన్​ రాశీఖన్నా.. సినిమా గురించి పలు విషయాలను తెలిపారు. ఆ వివరాలివీ..

ఏ విషయంలో రాశీ ఖన్నాకు మీరు థ్యాంక్స్‌ చెప్తారు?

చైతన్య:రాశికి ఎందుకు థ్యాంక్స్‌ చెప్పాలో అనే విషయాన్ని వివరించేందుకు ఒక్క ఇంటర్వ్యూ సరిపోదు. వెబ్‌ సిరీస్‌లా ఏడెనిమిది భాగాల్లో చెప్పాలి (నవ్వుతూ..).

చైతన్యకు మీరెందుకు థ్యాంక్‌ యూ చెప్పాలనుకుంటున్నారు?

రాశి: చాలా విషయాల్లో ఆయనకు థ్యాంక్స్‌ చెప్పాలి. ముఖ్యంగా, నాకు కొత్త సంగీతాన్ని పరిచయం చేసినందుకు, ఆహారం ఇచ్చినందుకు, మంచి పుస్తకాలు సూచించినందుకు చైతూకు కృతజ్ఞతలు.

నో థ్యాంక్స్‌ అని ఎప్పుడు చెప్పారు?

రాశి: సెట్స్‌లోనూ నాగచైతన్య వివిధ రకాల వంటకాల్ని ప్రయత్నించమనేవారు. ఆ సమయంలో 'నో థ్యాంక్స్‌' చెప్పి, దానికి దూరంగా ఉండేదాన్ని.

చైతన్య: నో థ్యాంక్స్‌ అని చెప్పే సందర్భాలు జీవితంలో ఎన్నో సార్లు ఎదురయ్యాయి. ఎదురవుతూనే ఉంటాయి.

ఈ సినిమాలో నటించడానికి కారణం?

చైతన్య: సందర్భానికి తగ్గట్టు ఫీలింగ్స్‌ ఎక్స్‌ప్రెస్‌ చేయాలనే విషయాన్ని ఈ 'థ్యాంక్‌ యూ' స్క్రిప్టు గుర్తుచేసింది. ఈ కథ విన్న వెంటనే నా జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తులకు థ్యాంక్స్‌ చెప్పాలనిపించింది. ఆ ఫీలింగ్‌తోనే ఈ సినిమాలో నటించా.

రాశి: సినిమాటోగ్రాఫర్‌ పీసీ శ్రీరామ్‌ ఈ సినిమాకి పనిచేస్తున్నారని, కథ బావుందని నటించా.

మీ తొలి ప్రేమ గురించి చెప్తారా?

చైతన్య: తొమ్మిదో తరగతి చదివేటప్పుడు ఓ అమ్మాయిపై మాకు (ఇద్దరు స్నేహితులు) క్రష్‌ ఉండేది. తను మా హృదయాలను ముక్కలు చేయడంతో మేం ముగ్గురం బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా మారాం (నవ్వులు..).

తొలి సంపాదన జ్ఞాపకాలు?

రాశి:మోడలింగ్‌తో తొలిసారి రూ. 5 వేలు సంపాదించా.

చైతన్య: నా పాఠశాల రోజుల్లో.. మా ఇంట్లో ఇంగ్లిష్‌, హిందీ పాటల సీడీలు బోలెడన్ని ఉండేవి. ఆ ఆల్బమ్స్‌ని ఖాళీ సీడీల్లోకి కాపీ చేసి, వాటిని అమ్మి డబ్బు సంపాదించా.

సోషల్‌ మీడియా వినియోగంపై రాశీ ఖన్నా స్పందిస్తూ "ఒక్క రోజులో నేను ఇన్‌స్టాగ్రామ్‌ని సుమారు 2 గంటలు వాడతా. చైతన్య ఎంత సేపు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటారోనని ఓసారి తన ఫోన్‌ తీసుకుని, ‘స్క్రీన్‌ టైమ్‌’ పరిశీలించా. అందులో 4 నిమిషాలు చూపించింది. ఆయనకు ఇన్‌స్టాపై ఆసక్తి లేదని తెలిసింది" అని రాశి చెప్పారు.

"సోషల్‌ మీడియా అద్భుతమైన టూల్‌. కానీ, అదే మన జీవితం కాకూడదు. ఈ విషయం నాకు లాక్‌డౌన్‌ సమయంలో బోధపడింది" అని నాగచైతన్య తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చైతన్య, రాశి పంచుకున్న మరికొన్ని ఆసక్తికర విశేషాలు ఈ వీడియోలో చూసేయండి..

ఇదీ చూడండి: నటి సురేఖ వాణి భావోద్వేగం.. భర్తతో గడిపిన చివరి క్షణాలను గుర్తుచేసుకుని..

ABOUT THE AUTHOR

...view details