Naga Chaitanya Shobitha Photo: టాలీవుడ్ స్టార్ జంట నాగచైతన్య సమంత విడిపోయిన తర్వాత వారి కొత్త రిలేషన్ గురించి అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. అప్పట్లో సామ్ ఓ మోడల్‌తో ప్రేమలో పడ్డట్లు వచ్చిన వార్తల తరహాలోనే చైతూపై ఓ రూమర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 'మేడిన్ హెవెన్' వెబ్‌సిరీస్‌తో పాపులర్ అయిన ప్రముఖ నటి శోభితా ధూళిపాళ్లతో నాగ చైతన్య రిలేషన్లో ఉన్నారు అని పలుమార్లు నెట్టింట చర్చలు జరిగాయి. అయితే వీటిని నిజం చేసేలా ఉన్న ఓ ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.
ఆ స్టార్ హీరోయిన్‌తో చైతూ రిలేషన్!.. ఫొటో వైరల్.. సమంత ఫ్యాన్స్ సీరియస్ - naga chaitanya latest news
టాలీవుడ్ స్వీట్ కపుల్ చై-సామ్ విడిపోయాక వారిద్దరి గురించి ఎన్నో వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఓ వైపు సామ్ రిలేషన్ గురించి రూమర్స్ చెలరేగుతున్న సమయంలో చైతూకు సంబంధించిన ఓ ఫొటో వైరల్‌గా మారింది.
లండన్ స్ట్రీట్స్‌లో దిగినట్లు కనిపిస్తున్న ఆ ఫొటో గురించి ఒకొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ ఇద్దరి నెక్ట్స్ ప్రాజెక్ట్‌లో భాగంగా వీళ్లు ఇలా కలిసి ఫొటోలకు పోజులిచ్చారని సినిమా ఇండస్ట్రీలోని కొందరు చెబుతుండగా.. చైతూ స్పెషల్‌గా తన బర్త్‌డే జరుపుకోవడానికే యూకే వెళ్లినట్లు మరికొందరు అంటున్నారు. అయితే ఈ ఫొటో చూస్తుంటే.. ఇద్దరూ ఏదో క్యాజువల్‌గా కెమెరాకు పోజులిచ్చారు తప్ప.. తమ మధ్య ఏమీ లేదని చెబుతున్నట్లుగా ఉందని మరికొంతమంది అంటున్నారు.
ఈ రూమర్స్ అన్నింటిని నాగచైతన్య టీమ్ ఖండించారు. ఇవన్నీ నిరాధార ఆరోపణలని ఎవరో కావాలని చేస్తున్న ప్రచారమని స్పష్టత ఇచ్చారు. శోభిత సైతం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అదంతా ట్రాష్ అంటూ కొట్టిపడేశారు. ఈలోపు సమంత ఫ్యాన్స్ కూడా సీరియస్ అవుతు్నారు.
అయితే ఈ ఫొటోను నిశితంగా పరిశీలించిన కొందరు అది మార్ఫింగ్ ఫోటో అంటున్నారు. వేర్వేరు సందర్భాల్లో దిగిన నాగ చైతన్య, శోభిత ఫొటోలు మార్ఫింగ్ చేశారని ట్వీట్ చేస్తున్నారు.