Adipurush Twitter Review : రామాయణ ఆధారంగా తెరకెక్కిన మైథలాజికల్ మూవీ ఆదిపురుష్. ప్రభాస్ రాఘవుడిగా కృతి సనన్ జానకిగా నటించిన ఈ సినిమా 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా..ఇండియా వైడ్‌గా 4000 పైగా స్క్రీన్స్‌లో శుక్రవారం గ్రాండ్‌గా రిలీజైంది. ఇప్పటికే ప్రీమియర్ షోస్ చూసిన అభిమానులు.. ట్విట్టర్ వేదికగా సినిమా గురించి తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
ఆదిపురుష్ ఓ మంచి మూవీ అని ఊహకు అందని విజువల్స్‌తో బాగుందని కొందరు అభిప్రాయపడగా.. ప్రభాస్ రాముడిగా తెరపై అద్భుతంగా కనిపించారని మరికొందరు అంటున్నారు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ కూడా బాగున్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఫస్ట్ హాఫ్ బాగుందని.. సినిమాకు మ్యూజిక్ హైలైట్‌గా నిలిచిందని ఓ నెటిజన్ కామెంట్ చేయగా..ఫైటింగ్ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయని మరొకరు ట్వీట్ చేశారు. సినిమా మొదట్లో వచ్చే యానిమేషన్ సీన్స్ బాగున్నాయని.. కథను వివరించిన తీరు బాగుందని అలాగే పాటలు, బీజీఎం అద్భుతంగా ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు. ప్రభాస్, కృతి సనన్ తమ పాత్రల్లో ఒదిగిపోయారని అభిప్రాయపడుతున్నారు.
ప్రభాస్ యాక్షన్ సీన్స్ హైలైట్..
Adipurush Movie : 'ఆదిపురుష్'లో రాముడు పాత్రను ప్రభాస్ పోషించిన తీరు హైలైట్ అంటూ ఆడియన్స్ అంటున్నారు . రాముడిగా ఆయన యాక్టింగ్ సూపర్ అంటూ ప్రశంసల జల్లును కురిపిస్తున్నారు. ప్రభాస్‌పై తెరకెక్కించిన యాక్షన్ సీన్స్‌ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తూ చూస్తారని టాక్. అయితే మిగిలిన క్యారెక్టర్స్‌కు ఇంపార్టెన్స్ కూడా ఉండటం వల్ల ఆదిపురుష్‌లో ప్రభాస్ స్క్రీన్‌టైమ్ తక్కువగా కనిపించిన ఫీలింగ్ కలుగుతుందని కొందరు చెబుతున్నారు.ఇక ఫస్ట్ హాఫ్‌ను దర్శకుడు అద్భుతంగా స్క్రీన్‌పై చూపించారని అంటున్నారు.
తండ్రీ ఆయనే.. కొడుకూ ఆయనే..
Adipurush Review :సీతను రావణాసురుడు అపహరించే సీన్, లంకా దహనం, ఇంట్రవెల్ సీన్స్ సినిమాకు హైలైల్‌గా నిలిచాయని చెబుతోన్నారు. మొత్తానికి అటు మూవీ లవర్స్‌తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఈ సినిమా ఓ విజువల్ ట్రీట్ అని అంటున్నారు. రాముడి, రావణాసురుడి ఎంట్రీ, హనుమంతుడు సంజీవనిని తీసుకొచ్చే సీన్ అభిమానులకు గూస్బంప్స్ తెప్పిస్తాయని కామెంట్లు పెడుతున్నారు. ఇక శబరితో పాటు సుగ్రీవుడుతో రాముడి సన్నివేశాలు ఎమోషనల్‌గా ఉన్నాయని చెబుతున్నారు. మరో విశేషం ఏంటంటే ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయెల్ రోల్ చేశారంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. శ్రీ రాముని తండ్రి దశరదుడి క్యారెక్టర్లోనూ ప్రభాస్ కనిపించారని అంటున్నారు.