తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Most Anticipated Indian Movies of 2023 : 'టైగర్​ నాగేశ్వరరావు', 'సైంధవ్'​,'జవాన్'.. ఈ మూవీస్​ కోసం సినీ లవర్స్​ ఫుల్​ వెయిటింగ్​! - డుంకీ రిలీజ్​ డేట్​

Most Anticipated Indian Movies of 2023 : ఈ ఏడాది బాక్సాఫీస్​ ముందుకు 'జైలర్'​, 'గదర్​-2' లాంటి సినిమాలు వచ్చి హిట్​ టాక్​ అందుకుని దూసుకెళ్లగా... ఇప్పుడు అదే కోవలో పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. అందులో 'టైగర్​ నాగేశ్వరరావు','సైంధవ్​' లాంటి టాలీవుడ్​ సినిమాలతో పాటు మరిన్ని భారీ బడ్జెట్​ సినిమాలు కూడా ఉన్నాయి. అవేంటంటే..

Most Anticipated  Indian Movies of 2023
Most Anticipated Indian Movies of 2023

By ETV Bharat Telugu Team

Published : Aug 22, 2023, 8:24 PM IST

Most Anticipated Indian Movies of 2023 : సినీ ఇండస్ట్రీలో రోజుకో కొత్త సినిమా రూపుదిద్దుకుంటుంది. అగ్ర తారల నుంచి అప్​కమింగ్ స్టార్స్​ వరకూ అందరూ తమ సినిమాలతో థియేటర్లలో సందడి చేస్తుంటారు. అయితే అందులో కొన్ని మాత్రమే ఆడియెన్స్​ అంచనాలను మ్యాచ్​ చేయగా.. మరికొన్ని మాత్రం బాక్సాఫీస్​ వద్ద నిరాశగానే మిగులుతున్నాయి. అయినప్పటికీ సినీతారలు ఏ మాత్రం తగ్గకుండా వరుస సినిమాలతో అభిమానుల ముందుకొస్తున్నారు. రావడమే కాకుండా హిట్​ టాక్​ అందుకుని దూసుకెళ్తున్నారు. అలా గతేడాది వచ్చిన 'కాంతార', 'ఆర్​ఆర్​ఆర్'​ నుంచి ఈ ఏడాది వచ్చిన 'జైలర్'​ వరకు అన్ని సినిమాలు సెన్సేషన్​ క్రియేట్​ చేసినవే. ఈ క్రమంలో ఇప్పుడు మరిన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో ఓ సారి చూసేద్దామా..

కొత్త దర్శకుడితో 'కోథా' రాజు..
King Of Kotha Release Date :'సీతారామం' సినిమాలో రామ్​ అనే సాప్ట్ క్యారెక్టర్​తో ఆడియెన్స్​ను ఆకట్టుకున్న మలయాళ స్టార్​ దుల్కర్​ సల్మాన్​.. తాజాగా యాక్షన్​లోకి దిగిపోయారు. 'కింగ్ ఆఫ్ కోథా' అనే సినిమాలో ఆయన ఓ గ్యాంగ్​స్టర్​ కొడుకుగా కనిపించనున్నారు. అభిలాష్​ జోషీ అనే కొత్త దర్శకుడు ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. కమర్షియల్​ ఎంటర్టైనర్​గా తెరకెక్కనున్న ఈ సినిమా ఆగస్ట్​ 24న థియేటర్లలో విడుదల కానుంది.

'టోబీ'.. ఆద్యంతం ఆసక్తికరం..
Toby Release Date :కన్నడ స్టార్​ రాజ్​ బి శెట్టి నటించిన లేటెస్ట్ మూవీ 'టోబీ'. 'గరుడ గమన వృషభ వాహన', '777 చార్లి' లాంటి సినిమాలతో మంచి గుర్తింపు పొందిన కన్నడ నటుడు రాజ్‌ బి. శెట్టి ఈ సినిమాలో లీడ్​ పాత్రలో కనిపించారు. అంతే కాకుండా ఈ సినిమాకు ఆయన సహా రచయితగా కూడా పని చేశారు. బసిల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. గోపాలకృష్ణ దేశ్‌పాండే, రాజ్‌ దీపక్‌ శెట్టి, సంయుక్త హర్నాడ్‌ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించగా.. తాజాగా విడుదలైన టీజర్ కూడా సోషల్​ మీడియాలో సెన్సేషన్​ సృష్టిస్తూ ఆద్యంతం ఆకట్టుకుంది.

'జవాన్'​.. అక్కడ -ఇక్కడ..
Jawan Release Date : 'పఠాన్​' సినిమాతో యావత్​ ఇండియాను షేక్​ చేసిన బాలీవుడ్ బాద్​షా షారుక్​ ఖాన్​.. ఇప్పుడు 'జవాన్'​గా ఆడియెన్స్​ ముందుకు రానున్నారు. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్​ ఎంటర్టైనర్​లో నయనతార , విజయ్‌ సేతుపతి, ప్రియమణి లాంటి స్టార్స్​ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా విడుదలైన హిందీ ప్రివ్యూ కూడా మంచి క్రేజ్​ సంపాదించుకోగా..ఈ సినిమా సెప్టెంబర్‌ 10న పాన్​ ఇండియా లెవెల్​లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

డార్లింగ్​ ఫ్యాన్స్​కు నీల్​ ట్రీట్..
Salaar Release Date :పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో పలు భారీ ప్రాజెక్ట్స్​కు సైన్​ చేసిన ఆయన త్వరలో 'సలార్‌' అనే యాక్షన్‌ థ్రిల్లర్‌ మువీతో ఆడియెన్స్​ను పలకరించనున్నారు. 'కేజీయఫ్​' దర్శకుడు ప్రశాంత్​ నీల్​ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, మధు గురుస్వామి, ఈశ్వరీ రావు, శ్రీయా రెడ్డి, రామచంద్రరాజు, టీను ఆనంద్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. హోంబలే ఫిలింస్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న పాన్​ ఇండియా లెవెల్​లో గ్రాండ్​గా రిలీజ్​ కానుంది.

యాక్షన్​ కింగ్​తో దళపతి ఫైట్​..
Leo Release Date : తమిళ స్టార్​ హీరో దళపతి విజయ్‌ లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'లియో'. లోకేశ్​ కనగరాజ్​ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీలో యాక్షన్ కింగ్​ అర్జున్​, బాలీవుడ్​ స్టార్​ సంజయ్​ దత్​, ప్రియా ఆనంద్‌, మన్సూర్ అలీఖాన్‌, మలయాళ నటి శాంతి మాయాదేవి, గౌతమ్ వాసు దేవ్‌మీనన్‌, మాథ్యూ థామస్‌, మిస్కిన్‌, సాండీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్‌ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్‌ 19న వరల్డ్ వైడ్​గా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్​ కానుంది.

రవితేజకు ఇది ఫస్ట్​ టైం..
Tiger Nageswara Rao Release Date : ఇటీవలే విడుదలైన 'రావణాసుర'లో విలన్​ షేడ్స్​ ఉన్న పాత్ర పోషించి అందరినీ మెప్పించారు మాస్​ మహారాజ రవితేజ. ఇప్పుడు ఆయన 'టైగర్‌ నాగేశ్వరరావు'గా వెండితెరపై కనిపించేందుకు సిద్ధమౌతున్నారు. ఆయన కెరీర్​లో ఇదే తొలి బయోపిక్‌. 70స్​లో పేరు మోసిన స్టూవర్ట్‌పురం గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవితకథగా రూపొందుతున్న ఈ సినిమా అక్టోబర్​ 20న థియేటర్లలో సందడి చేయనుంది.

'టైగర్'​లో ఆయన ఇంపార్టెంట్​ గురూ..
Tiger 3 Release Date :'కిసీ కా భాయ్​ కిసీకి జాన్​' సినిమాతో ఆడియెన్స్​ ముందుకొచ్చిన బాలీవుడ్​ కండల వీరుడు సల్మాన్​ ఖాన్​.. త్వరలో 'టైగర్ 3​' సినిమాతో థియేటర్లలో సందడి చేయనున్నారు. మనీశ్​ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కత్రినా కైఫ్, ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ​ఈ సినిమాలో షారుక్ ఖాన్ కూడా ఓ కీ రోల్​లో కనిపించనున్నారని టాక్​. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 10న విడుదలకు సిద్ధం కానుంది.

బీస్ట్​ మోడ్​లో రణ్​బీర్​ కపూర్​
Animal Movie Release Date : టాలీవుడ్​ దర్శకుడు సందీప్​ రెడ్డి వంగా బాలీవుడ్​లో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'అనిమల్​'. రణ్​బీర్​ కపూర్​ లీడ్ రోల్​లో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న , అనిల్ కపూర్​, బాబీ డియోల్‌ కీలక పాత్రలు పోషించారు. క్రైమ్​ అండ్​ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమా డిసెంబర్​ 1న పాన్​ ఇండియా లెవెల్​లో రిలీజయ్యేందుకు రెడీ అవుతోంది.

'కెప్టెన్​ మిల్లర్​' వచ్చేస్తున్నారు..
Captain Miller Release Date : కోలీవుడ్ స్టార్ హీరో ధనూశ్​ ఇటీవలే 'సార్' ​ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్​ ముందు కాసుల వర్షం కురిపించింది. ఇక ఈ మూవీ తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టార్​ హీరో.. తాజాగా 'కెప్టెన్​ మిల్లర్'​గా తెరపై కనిపించనున్నారు. జి.శరవణన్‌, సాయి సిద్ధార్థ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ధనుశ్ సరసన ప్రియాంక అరుల్‌ మోహన్‌ నటిస్తుండగా.. సందీప్‌ కిషన్‌, శివరాజ్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్​లో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్​ 15న థియేటర్లలోకి రానుంది.

ఆ స్టార్​ హీరోయిన్​తో షారుక్..
Dunki Release Date : 'జవాన్​'తో ఈ ఏడాది సెప్టెంబర్​లో ప్రేక్షకుల ముందుకు రానున్న స్టార్ హీరో షారుక్ ఖాన్​.. మరోసారి తన సినిమాతో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమౌతున్నారు. రాజ్​ కుమార్​ హిరాణీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డుంకీ' అనే సినిమాలో తాప్సీ సరసన నటిస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఈ డిసెంబర్​ 22న విడుదలకు సిద్ధం కానుంది.​

'సైంధవ్'​గా రానున్న వెంకీ మామ..
Saindhav Movie Release Date : టాలీవుడ్ స్టార్​ హీరో విక్టరీ వెంకటేశ్‌ లీడ్​ రోల్​లో నటిస్తున్న తాజా చిత్రం 'సైంధవ్‌'. శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా లాంటి స్టార్స్​ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా డిసెంబర్​ 23 థియేటర్లలో రిలీజ్​ కానుంది.

Raviteja Tiger Nageswarao Teaser : 'టైగర్‌ నాగేశ్వరరావు' వచ్చేశాడు.. 8 ఏళ్లకే రక్తం తాగిన క్రిమినల్​గా..

ప్రభాస్ 'సలార్'​కు పోటీగా మరో సంచలన దర్శకుడి మూవీ కన్ఫామ్​.. సెన్సేషన్​​ అవుతుందా?

ABOUT THE AUTHOR

...view details