తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఒకే సినిమాలో 100కు పైగా కుక్కలు.. వాటి కష్టాలే స్టోరీ.. డైరెక్టర్​ పెద్ద సాహసమే చేశారుగా!

100 Dogs Movie : సాధారణంగా జంతువులతో సినిమాలో యాక్టింగ్​ చేయించాలంటే.. చాలా కష్టం. వాటికి సరైన ట్రైనింగ్ ఇవ్వాలి. అదే వందకు పైగా శునకాలను ఒకే సినిమాలో పెట్టి.. తీస్తే ఎలా ఉంటుంది? ఓ దర్శకుడు అలాంటి సాహసమే చేశారు. ఆ సినిమా సంగతులు మీకోసం..

More Than 100 Dogs Cast In Malayalam Movie Valatty Tale Of Tails
More Than 100 Dogs Cast In Malayalam Movie Valatty Tale Of Tails

By

Published : Aug 4, 2023, 12:00 PM IST

100 Dogs Movie : ప్రస్తుత రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. జంతువులను సినిమాల్లో వాడటం కామన్ అయిపోయింది. వాటి ఎమోషన్స్​ను ఎంతో నైపుణ్యంతో క్యాప్చర్ చేసి.. ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు దర్శకులు. అయితే తాజాగా మలయాళంలో తెరకెక్కిన 'వాలాట్టి: టేల్ ఆఫ్ టెయిల్స్' చిత్రం.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జూలై 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం శునక ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో కుక్కలు కూడా మాట్లాడడం విశేషం!

Valatty Tale Of Tails : కేరళలో వీధి కుక్కల సమస్య తీవ్రంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో వాలాట్టి: టేల్ ఆఫ్ టేల్స్ చిత్రాన్ని మేకర్స్​ విడుదల చేశారు. కుక్కతో సినిమా తీయడమే సవాల్. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు దేవన్ 100కు పైగా కుక్కలను పట్టుకుని సినిమా తీశారు. అయితే కుక్కల గురించి చాలా మందికి చెడు అభిప్రాయం ఉందని, ఈ అభిప్రాయాన్ని మార్చుకోవాలనేది చిత్రం ఉద్దేశమని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అందుకే కుక్కలు తమ కష్టాలు చెప్పుకునే విధంగా సినిమా తీశామని చెప్పారు.

Malayalam Dogs Movie : ఈ చిత్రంలో నటించిన కుక్కల చాలా బాగుంటాయిని డైరెక్టర్​ దేవన్​ తెలిపారు. వాటి బాధను తెలిసేలా చేస్తాయని చెప్పారు. రోషన్ మాథ్యూ, రవీనా రవి, సన్నీ వేన్, అజు వర్గీస్ శునకాల పాత్రలకు డబ్బింగ్ చెప్పారని వివరించారు. మూడేళ్ల క్రితం మేకర్స్ కుక్కపిల్లలను.. కొనుగోలు చేసి శిక్షణ అందించారని వెల్లడించారు.

సాధారణంగా శునకాలతో వచ్చిన సినిమాలు.. చిన్న పిల్లలు, పెద్దలను బాగా ఆకట్టుకుంటున్నాయి. గత సంవత్సరం వచ్చిన చార్లీ 777 చిత్రం చిత్రమే ఇందుకు ఉదాహరణ. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయి హిట్ అందుకుంది. రక్షిత్ శెట్టితోపాటు ఓ శునకం నటించింది. ఒక కుక్క కంటతడి దేశమంతటా హృదయాలను గెలుచుకుంది. ఇటీవల విడుదలైన తమిళ చిత్రం ‘అప్పత’ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు మలయాళం వాలాట్టి: టేల్ ఆఫ్ టెయిల్స్ సినిమా కూడా ఆకట్టుకుంటోంది. తెలుగులోనూ ఈ సినిమా రానుందని అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details