తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కీరవాణి స్పెషల్ సాంగ్- అన్ని సినిమాలకు 'నా సామిరంగ' టీమ్ విషెస్ - సంక్రాంతి సినిమాలు 2024

MM Keeravani Special Wishes Sankranti Movies: ఈ సంక్రాంతికి టాలీవుడ్​లో నాలుగు సినిమాలు బరిలో నిలిచాయి. ఈ నేపథ్యంలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి 'నా సామిరంగ' టీమ్​ తరఫున సంక్రాంతి బరిలో నిలిచిన మూవీటీమ్స్​కు స్పెషల్ విషెస్ తెలిపారు.

MM Keeravani Special Wishes Sankranti Movies
MM Keeravani Special Wishes Sankranti Movies

By ETV Bharat Telugu Team

Published : Jan 10, 2024, 10:48 PM IST

MM Keeravani Special Wishes Sankranti Movies: 2024 సంక్రాంతి పోటీ సినీప్రియులకు ఆసక్తి రేపుతోంది. ఈ పోటీ​లో థియేటర్ల అడ్జెస్ట్​మెంట్స్ పట్ల కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ, నాలుగు సినిమాలు సంక్రాంతి రిలీజ్​కు రెడీ అయిపోతున్నాయి. ఈ క్రమంలోనే అన్ని సినిమాల మేకర్స్ ఇప్పటికే ట్రైలర్​లు విడుదల చేసి, ప్రీ రిలీజ్ ఈవెంట్​లు కూడా కంప్లీట్ చేశాయి.

తాజాగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ఎమ్ కీరవాణి 'నా సామిరంగ' టీమ్​ తరఫున సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలకు స్పెషల్ విషెస్ చెబుతూ ఓ పాట రిలీజ్ చేశారు. అన్ని సినిమాల డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, సినీ గోయర్స్​ ఇలా అందరికీ పాటలో ఆల్​ ది బెస్ట్ చెప్పారు. సింపుల్​ లిరిక్స్​, ఫోక్ బీట్​ బ్యాక్​గ్రౌండ్​తో ఉన్న ఈ పాట నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

అందరికీ ఆల్ ది బెస్ట్: మెగాస్టారు ఆశీస్సులు పొంది, హిట్టుదారి పట్టారంటూ సజ్జ- ప్రశాంత్ వర్మ సినిమా 'ఆల్​ ది బెస్ట్​ నీకు హను-మాన్​' అని, అలాగే 'ఆల్​ ది బెస్ట్ గుంటూరు కారం, నువ్వు అదరగొట్టు ఈ శుక్రవారం' అని మహేశ్ మూవీకి, 'డైమండ్ జూబ్లీ (75)లో హిట్​ కొట్టాలంటూ సైంధవ టీమ్​కు ఈ పాటతో స్పెషల్ విషెస్ తెలిపింది నా సామిరంగ మూవీటీమ్.

Naa Saami Ranga Pre Release Event: నా సామిరంగ ప్రీ రిలీడ్ ఈవెంట్ బుధవారం హైదరాబాద్​లో గ్రాండ్​గా జరిగింది. ఈవెంట్​లో పాల్గొన్న హీరో నాగార్జున కూడా, సంక్రాంతి బరిలో ఉన్న ప్రతీ హీరోకి విషెస్ తెలిపారు. ఈక్రమంలో ఇండస్ట్రీలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మహేశ్​బాబుకు, చైల్డ్ ఆర్టిస్ట్​ నుంచి హీరోగా ఎదిగిన తేజ సజ్జకు, 75 సినిమాలు కంప్లీట్ చేసుకున్న వెంకటేశ్​కు పేరుపేరున నాగార్జున అల్​ ది బెస్ట్ చెప్పారు.

ఇక మహేశ్​ బాబు 'గుంటూరు కారం', తేజ సజ్జా 'హనుమాన్' సినిమాలు జనవరి 12న రాగా, విక్టరీ వెంకటేశ్​ 'సైంధవ్' జనవరి 13న, నాగార్జున అక్కినేని 'నా సామిరంగ' జనవరి 14న థియేటర్లలో సందడి చేయనున్నాయి.

ఇంట్రెస్టింగ్​గా పొంగల్​ ఫైట్- హీరోల మధ్యే కాదు పోటీలో డైరెక్టర్లు కూడా!

కళ్లు చెదిరే రేంజ్​లో 'గుంటూరు కారం' బిజినెస్ - ఈ సంక్రాంతికి బిగ్గెస్ట్ టార్గెట్ ఇదే!

ABOUT THE AUTHOR

...view details