తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కృష్ణంరాజు 'మా' ప్లాన్​.. ఆయన మంచు విష్ణుతో అలా చేయించారా? - కృష్ణంరాజు మంచు విష్ణు

కృష్ణంరాజు తుదిశ్వాస విడవడం చాలా బాధకరమైన విషయమని మంచు విష్ణు భావోద్వేగం అయ్యారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

manchu vishnu
మంచు విష్ణు కృష్ణంరాజు

By

Published : Sep 14, 2022, 1:04 PM IST

దిగ్గజ నటుడు కృష్ణంరాజు అనారోగ్య సమస్యలతో ఇటీవలే కన్నుమూశారు. దీంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. దీంతో ఫిల్మ్​నగర్​లో కృష్ణంరాజు సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన మంచు విష్ణు.. కృష్ణంరాజుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

"నేను మా ప్రెసిడెంట్ అయ్యను అంటే దానికి కారణం కృష్ణంరాజు. నా చిన్నప్పటి నుంచి నేను ఆయన ఇంటికి వెళ్లేవాడిని. ఆయన కూడా మా ఇంటికి వచ్చేవారు. అదీగాక నాన్నకు.. ఆయనకు మధ్య చాలా సన్నిహిత సంబంధం ఉండేది. ఆయనే నన్ను మా ఎన్నికల్లో పోటీ చేయమన్నారు. అసలు నాకు ముందు ఫోన్ చేసి నువ్వు ఈ సారి మా ప్రెసిడెంట్​గా పోటీ చేయాలి అని చెప్పిందే ఆయన. నేను నిలబడటం నాన్నకు ఇష్టం లేకపోయినా కానీ ఆయనే నాకు ఫొన్ చేసి దబాయించి "రేయ్ ఈ సారి నువ్వు నిలబడుతున్నావ్ అంతే" అన్నారు. దాంతో నేను ఆయన మాట కాదనలేక పోయాను" అని మంచు విష్ణు అన్నారు.

కృష్ణంరాజు ఇక లేకపోవడం చాలా దురదృష్టకరం అంటూ విష్ణు భావోద్వేగానికి గురి అయ్యారు. కృష్ణంరాజులో ఉన్న ఠీవి మరే ఇతర నటులలో లేదని, ఆయన ఎక్కడికి వెళ్లినా.. ఏ వేడుకకు వచ్చినా గానీ రాజసం కనపడేదని చెప్పారు.

ఇదీ చూడండి: నటి సంగీతపై దర్శకులు బాల, కృష్ణవంశీ ఫుల్​ ఫైర్.. మరీ ఇలా తిట్టేశారేంటి!

ABOUT THE AUTHOR

...view details