Manchu Manoj Ustaad Talk Show Promo :టాలీవుడ్ స్టార్ హీరో మంచు మనోజ్ త్వరలో బుల్లితెరపై ప్రేక్షకులను పలకరించనున్నారు. ఆయన హోస్ట్‌గా 'ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం' అనే గేమ్ షో ప్రారంభం కానుంది. ఈ షో ప్రోమో రిలీజ్ ఈవెంట్ బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు హీరో మనోజ్ తన సతీమణి భూమా మౌనికతో కలిసి హాజరయ్యారు. కాగా, ఆయన భార్య మౌనిక, ఈ ప్రోగ్రామ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ షో డిసెంబర్ 15 నుంచి ఈటీవీ విన్లో ప్రసారం కానుంది.
ఇక మనోజ్ కెరీర్లో తొలిసారిగా హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ ఈవెంట్‌కు హోస్ట్ మనోజ్ ఫ్యామిలీ సహా, నిర్మాత వివేక్ కుచిబొట్ల, రైటర్ బీవీఎస్ రవి, ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయికృష్ణ, పలువురు సెలబ్రిటీలు, తదితరులు పాల్గొన్నారు. ఈ గేమ్ షో పలు సీజన్ల వారిగా ప్రసారం కానున్నట్లు ప్రోగ్రామ్ టీమ్ పేర్కొంది. కాగా, గేమ్ షోకు ఎవరెవరు సెలబ్రిటీలు వచ్చారన్న విషయం బయటకు వెల్లడించలేదు.
అయితే 2017 మనోజ్ నుంచి సినిమాలు రాలేదు. దాదాపు ఆరేళ్ల తర్వాత ఆయన ఆడియన్స్‌ను పలకరించబోతున్నారు. ఈ విషయంపై మనోజ్ కూడా ఉత్సాహంగా ఉన్నారు. 'తిరిగొస్తున్నా. నేను మిస్ అయిన నా మచ్చాస్ (ఫ్రెండ్స్)ని కలిసేందుకు, నన్ను మిస్ అయిన చిచ్చాస్ (ఫ్యాన్స్)ని పలకరించేందుకు రేపు కలుద్దాం. ఇక కసుస్తూనే ఉందాం' అని మంగళవారం ట్వీట్ చేశారు.