Mahesh Trivikram movie story: మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'ఎస్‌ఎస్‌ఎమ్‌బీ#28'. ఈ కాంబోలో ముచ్చటగా మూడోసారి రావడం వల్ల దీనిపై ప్రేక్షకులు, అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఆగస్టు మొదటివారం నుంచి షూటింగ్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ మూవీ జోనర్ ఏంటి అనే దానిపై ప్రస్తుతం చర్చ నెలకొంది. కొంతకాలంగా యాక్షన్ డ్రామా స్టోరీలపై దృష్టి సారించి సైలెంట్ బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్నారు దర్శకుడు త్రివిక్రమ్.
మహేశ్-త్రివిక్రమ్ మూవీ.. కథ ఇదేనటా? - మహేశ్ త్రివిక్రమ్ కథ లీక్
Mahesh Trivikram movie story: మహేశ్‌బాబు-త్రివిక్రమ్ కాంబోలో రానున్న సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో పాటుగా తనదైన యాక్షన్‌శైలి, డ్రామాను అన్వయించి సరికొత్త కథను త్రివిక్రమ్ సిద్ధం చేశారని తెలిసింది.
అయితే మహేశ్ బాబుతో పదేళ్ల తరువాత సినిమా తీస్తుండటంతో కొత్త తరహా రాజకీయ నేపథ్యాన్ని కథగా ఎంచుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. భారీ తారగణంతో తెరకెక్కించనున్న ఈ సినిమాలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో పాటుగా తనదైన యాక్షన్‌శైలి, డ్రామాను అన్వయించి సరికొత్త కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడ లేదు. ఇదే నిజమైతే మహేశ్ బాబును మరొక్కసారి రాజకీయనేతగా చూడవచ్చు. ఇంతకుముందు రాజకీయనేపథ్యంలో వచ్చిన 'భరత్ అనే నేను' బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. మరిప్పుడు త్రివిక్రమ్ ఏ రేంజ్‌లో మహేశ్‌ను చూపిస్తారనే విషయంపై అభిమానులతో పాటు, ప్రేక్షకుల్లోను ఆసక్తి నెలకొంది.
ఇదీ చూడండి: వారితో పనిచేశా.. మరి ఆ తర్వాత నాకెందుకు అవకాశాలు రాలేదో: చరణ్