ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తే అభిమానులకు వచ్చే ఆ కిక్కే వేరు. అయితే ఇప్పటికే పలువురు హీరోలు ఇలాంటి మజాను ఫ్యాన్స్‌కు పంచగా.. ఇప్పుడు మరో మల్టీస్టారర్ రెడీ అవ్వబోతున్నట్లు తెలిసింది. అదేంటంటే..
పాన్ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్ట్‌లలో నటిస్తున్నారు. అందులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రానున్న ప్రాజెక్ట్ కె ఒకటి. అయితే ఇప్పుడీ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికీ ఈ మూవీలో బాలీవుడ్ దిగ్గజ నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్, స్టార్ హీరోయిన్స్ దీపిక పదుకొణె, దిశాపటానీ నటిస్తుండగా.. ఇప్పుడు ఈ చిత్రంలో మరింత మంది బడా స్టార్స్ కనపడబోతున్నట్లు తెలుస్తోంది.