Mahesh Babu Lokesh Kanagaraj: తమిళ క్రేజీ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్‌తో కలిసి సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. 'ఖైదీ', 'మాస్టర్' లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను తీశారు లోకేశ్. ఇటీవలే 'విక్రమ్' సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన.. మహేశ్‌ను కలవడం వల్ల టాలీవుడ్లో ఈ మేరకు జోరుగా ప్రచారం సాగుతోంది. వీరిద్దరూ దాదాపు 2గంటల పాటు చర్చలు జరిపినట్లు సమాచారం. అన్నీ కుదిరితే ఈ ప్రాజెక్టును ఓకే చేసేందుకు మహేశ్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
క్రేజీ డైరెక్టర్‌తో మహేశ్ కొత్త సినిమా! విజయ్‌తో మరోసారి!! - లోకేశ్ కనకరాజ్
Mahesh Babu Lokesh Kanagaraj: ఇప్పటికే త్రివిక్రమ్, దర్శక ధీరుడు రాజమౌళితో ప్రాజెక్టులను ప్రకటించిన సూపర్‌స్టార్ మహేశ్ బాబు.. త్వరలోనే మరో సెన్సేషనల్ డైరెక్టర్‌తో పనిచేయనున్నట్లు తెలుస్తోంది. 'ఖైదీ', 'మాస్టర్' లాంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన లోకేశ్ కనకరాజ్ దర్శకతంలో మహేశ్ సినిమా చేయనున్నట్లు చిత్ర పరిశ్రమలో జోరుగా చర్చ నడుస్తోంది.
mahesh babu next film
ప్రస్తుతానికి విహారయాత్రలో ఉన్న మహేశ్.. త్వరలోనే త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమా సెట్లో అడుగుపెట్టనున్నారు. ఆ తర్వాత తొలిసారి రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. ఇక యూనివర్సల్ హీరో కమల్ హాసన్‌తో తెరకెక్కించిన 'విక్రమ్' సినిమా విడుదల కోసం లోకేశ్ ఎదురు చూస్తున్నారు. అనంతరం సూపర్‌స్టార్ విజయ్‌తో కలిసి మరో చిత్రాన్ని (Thalapathy 67) చేయనున్నట్లు ఇటీవలే ఓ వేడుకలో స్పష్టంచేశారు.
ఇదీ చూడండి:మాకు విడాకులు కావాలి: కియారా అడ్వాణీ, వరుణ్ ధావన్