తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మహేశ్ ఫ్యాన్స్​పై నమ్రత ఇంట్రెస్టింగ్​ పోస్ట్​ - ఇప్పుడిదే ట్రెండింగ్​ - గుంటూరు నమ్రత పోస్ట్​

Mahesh Babu Guntur Karam Movie : మహేశ్‌బాబు ఫ్యాన్స్‌పై నమ్రత ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మహేశ్ ఫ్యాన్స్​పై నమ్రత ఇంట్రెస్టింగ్​ పోస్ట్​ - ఇప్పుడిదే ట్రెండింగ్​
మహేశ్ ఫ్యాన్స్​పై నమ్రత ఇంట్రెస్టింగ్​ పోస్ట్​ - ఇప్పుడిదే ట్రెండింగ్​

By ETV Bharat Telugu Team

Published : Jan 10, 2024, 12:15 PM IST

Mahesh Babu Guntur Karam Movie : ప్రస్తుతం గుంటూరు కారం అడ్వాన్స్ బుకింగ్స్​లో ఫుల్​ ట్రెండింగ్​లో ఉంది. ఈ సంక్రాంతికి ఘాటుతో పసందైన దమ్‌ మసాలా బిర్యానీ వడ్డించేందుకు సిద్ధమయ్యారు మహేశ్‌ బాబు - దర్శకుడు త్రివిక్రమ్‌. ఈ ఇద్దరి కాంబినేషన్​లో రూపొందిన ఈ మాస్‌ యాక్షన్‌ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. అయితే సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో జనవరి 9న ప్రీ రిలీజ్ ఈవెంట్​ గ్రాండ్​గా జరిగింది.

ఈ సందర్భంగా సూపర్ స్టార్​ మహేశ్‌ బాబు అభిమానులను ఉద్దేశించి నమ్రత(Namratha Latest Insta post) ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. "మహేశ్‌ ఫ్యాన్స్​ గురించి ఇప్పటికే ఎంతో మంది గొప్పగా చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ఆయన్ను ఆదరిస్తున్నారు. ప్రతిసారి అండగా నిలిచి మరింత కష్టపడి పనిచేసేందుకు దోహదపడుతున్నారు. గుంటూరు ప్రీ రిలీజ్‌ ఈవెంట్​లో అభిమానులు చూపించిన ప్రేమను చూసి ఓ విషయం గర్వంగా చెప్పాలని ఉంది. మహేశ్‌ - అభిమానులకు మీరొక ఎమోషన్‌. ఈ ప్రేమ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను" అని రాసుకొచ్చారు.

అంతకుముందు గుంటూరు కారం సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో(Guntur Karam Pre Release Event) అభిమానులను ఉద్దేశించి మహేశ్‌ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. "మీరెప్పుడూ నా గుండెల్లోనే ఉంటారు. సంక్రాంతి పండగ నాకు, నాన్నగారికి బాగా కలిసొచ్చిన పండగ. ఆ సీజన్‌లో మా చిత్రం రిలీజ్ అయితే అది బ్లాక్‌బస్టరే. ఈ సారి కూడా అదే రిపీట్‌ అవుతుంది. కానీ, ఇప్పుడు నాన్న లేరు. ఆయన నా సినిమాలు చూసి రికార్డులు, కలెక్షన్ల గురించి చెబుతుంటే సంతోష పడేవాడిని. ఇప్పుడు ఆ సంగతులన్నీ మీరే చెప్పాలి. ఇక నుంచి మీరే నాకు అమ్మ, నాన్న" అని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియోనే ఇన్‌స్టాలో షేర్‌ చేసిన నమ్రత - మహేశ్​ అభిమానులను ఉద్దేశించి పోస్ట్‌ పెట్టారు. ఇకపోతే మహేశ్‌ హీరోగా నటించిన గుంటూరు కారం (Guntur Kaaram Release Date) సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఫుల్​ స్వింగ్​లో 'గుంటూరు కారం' ఓవర్సీస్​ బుకింగ్స్​ - ఎన్ని కోట్లు కలెక్ట్ అయ్యాయంటే?

సలార్, ఆర్​ఆర్​ఆర్​ రికార్డ్స్​ను బ్రేక్​ చేసిన గుంటూరు కారం

ABOUT THE AUTHOR

...view details