తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'గుంటూరు కారం' వసూళ్లు డౌన్​! - రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే?

Mahesh Babu Guntur Kaaram Day 2 Collections WorldWide : 'గుంటూరు కారం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మహేశ్ బాబు. ఎన్నో అంచనాలతో రిలీజైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో 'గుంటూరు కారం' 2 రోజుల వసూళ్లను తెలుసుకుందాం.

'గుంటూరు కారం' వసూళ్లు డౌన్​! - రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
'గుంటూరు కారం' వసూళ్లు డౌన్​! - రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే?

By ETV Bharat Telugu Team

Published : Jan 14, 2024, 12:10 PM IST

Mahesh Babu Guntur Kaaram Day 2 Collections WorldWide :సూపర్ స్టార్​​ మహేశ్ బాబు 'గుంటూరు కారం' జనవరి 12న భారీ స్థాయిలో విడుదలైన సంగతి తెలిసిందే. మొదటి షో నుంచే మిక్స్డ్​ టాక్(Guntur Kaaram Review) తెచ్చుకున్నప్పటికీ ఈ చిత్రం రికార్డ్​ స్థాయిలో ఓపెనింగ్స్​ను దక్కించుకుంది. వరల్డ్​ వైడ్​గా తొలి రోజు రూ. 94 కోట్లు వసూళ్లను అందుకుని ఆల్​ టైమ్ రికార్డ్ సాధించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్​ అఫీషియల్​గా అనౌన్స్​మెంట్​ చేసింది. ఇప్పుడు రెండో రోజు వసూళ్ల వివరాలను కూడా తెలిపింది చిత్ర నిర్మాణ సంస్థ. అయితే కలెక్షన్స్​ కాస్త డ్రాప్​ అయ్యాయి. అయినప్పటికీ ఈ చిత్రం రెండు రోజుల్లో వరల్డ్​ వైడ్​గా రూ.127కోట్ల వరకు కలెక్షన్లను సాధించినట్లు ప్రొడక్షన్ హౌస్​ ట్వీట్ చేసింది.

ఆక్యుపెన్సీ విషయానికొస్తే రెండో రోజు మార్నింగ్​ షో తెలుగు వెర్షన్​కు 34.48 శాతం, మ్యాట్నీ షో 46.98 శాతం, ఈవెనింగ్​ 51.08 శాతం, నైట్​ 50.45 శాతం అయ్యాయి. బిజినెస్ విషయానికొస్తే నైజాంలో రూ. 42 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.75 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు అన్నీ కలిపి రూ. 46.25 కోట్ల బిజినెస్ అవ్వగా మొత్తంగా తెలుగులో రూ. 102 కోట్లకు అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 9 కోట్లకు, ఓవర్సీస్​లో రూ. 20 కోట్లతో కలిపి మొత్తంగా వరల్డ్​ వైల్డ్​గా రూ. 132 కోట్లు బిజినెస్ జరిగినట్లు చెప్పాయి.

అతడు, ఖలేజ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ - సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో రూపొందిన చిత్రమే 'గుంటూరు కారం'. హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.200కోట్ల బడ్జెట్​తో(అంచనా) రాధాకృష్ణ నిర్మించారు. తమన్ సంగీతాన్ని సమకూర్చారు. చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలు పోషించారు.

'గుంటూరు కారం' మిక్స్డ్​ రివ్యూ - రియాక్ట్ అయిన దిల్​ రాజు, నాగవంశీ

రివ్యూ : కింగ్ ఈజ్ బ్యాక్​ - 'నా సామి రంగ' నాగ్ ర్యాంప్ ఆడిస్తున్నాడు!

ABOUT THE AUTHOR

...view details