Hebba Patel Rama Jogayya Shastry: 'కుమారి 21ఎఫ్'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముంబయి బ్యూటీ హెబ్బా పటేల్. తొలి చిత్రంతోనే బాక్సాఫీస్ బద్దలు కొట్టిన ఈ 'కుమారి'కి ఆ తర్వాత వరుస ఆఫర్లు వచ్చినప్పటికీ అవి పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. ఆడపదడపా చిత్రాల్లో అప్పుడప్పుడు కనిపిస్తున్న హెబ్బా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన ఫొటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది.
అయితే తాజాగా ఓ మూవీ షూట్ కోసం పోలాండ్ వెళ్లిన హెబ్బా అక్కడ ఓ లిరిసిస్ట్‌తో దిగిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. తన పాటల్లో కొత్తదనాన్ని నింపే ఆ రచయిత తనలోనూ కొత్త కోణాన్ని చూపించారు. ఆయన మరెవరో కాదు.. ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి. ఎప్పుడూ నుదుటన బొట్టు పెటుకొని, సంప్రదాయబద్దంగా కనిపించే రామజోగయ్య శాస్త్రి ఈ సారి మాత్రం స్టైల్ మార్చేశారు. ట్రెండీగా గాగుల్స్ పెట్టుకొని హెబ్బాపటేల్ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు షాకవుతున్నారు.