తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఓటీటీలోకి అందాల భామ ఎంట్రీ.. యాక్షన్​ కింగ్​ దర్శకత్వంలో విశ్వక్​సేన్​! - vishwak sen new movie arjun

హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. తన కెరీర్​లో తొలిసారిగా ఓ వెబ్ సిరీస్​లో నటిస్తున్నారు. మరోవైపు, హీరో విశ్వక్​సేన్​ తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాకు యాక్షన్​ కింగ్​ అర్జున్​ దర్శకత్వం వహించనున్నారు.

lavanya vishwaksen
lavanya vishwaksen

By

Published : Jun 19, 2022, 4:11 PM IST

Lavanya Tripathi On OTT: ప్రస్తుతం సినిమాల‌కు దీటుగా వెబ్ సిరీస్‌లు.. న‌టీన‌టుల‌కు మంచి పేరు తీసుకొస్తున్నాయి. గ‌త రెండు, మూడేళ్లుగా టాలీవుడ్‌లో వెబ్‌సిరీస్ రూపొందించే ధోర‌ణి పెరుగుతోంది. హీరోహీరోయిన్లు.. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్‌సిరీస్‌ల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌లోకి అరంగేట్రం చేస్తున్నారు.

లావణ్య త్రిపాఠి

'అందాల రాక్ష‌సి' సినిమాతో క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైన ఆమె.. జ‌యాప‌జ‌యాల‌కు అతీతంగా టాలీవుడ్‌లో త‌న ప్ర‌యాణాన్ని కొన‌సాగిస్తున్నారు. కెరీర్​లో తొలిసారి ఆమె ఓ వెబ్‌సిరీస్‌ను అంగీకరించారు. 'పులి మేక' అనే టైటిల్‌తో ఈ వెబ్‌సిరీస్ రూపొందుతుంది. ఇందులో లావ‌ణ్య త్రిపాఠితో పాటు హీరో ఆది లీడ్‌రోల్ చేస్తున్నారు. బిగ్‌బాస్ ఫేమ్ సిరిహ‌నుమంత్​, సుమ‌న్‌, ముక్కు అవినాష్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. క్రైమ్ థ్రిల్ల‌ర్​గా రూపొందుతున్న ఈ సిరీస్‌ను 'జీ5 ఓటీటీ' సంస్థ‌తో క‌లిసి ర‌చ‌యిత కోన వెంకట్ నిర్మిస్తున్నారు. పోలీస్ బ్యాక్‌డ్రాప్‌కు ఆస్ట్రాల‌జీ అంశాల‌ను ముడిపెడుతూ ఈ సిరీస్​ను తెర‌కెక్కిస్తున్నారు.

Vishwak Sen New Movie: ఇటీవలే 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమాతో హిట్​ అందుకున్న హీరో విశ్వక్​సేన్​ మంచి జోష్​ మీద ఉన్నారు. తాజాగా తన కొత్త సినిమా ప్రకటించారు. అయితే ఈ యువహీరో అదిరే ఛాన్స్​ కొట్టేశారని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. యాక్షన్​ కింగ్​గా సినీ ప్రియులకు సుపరిచితుడైన హీరో అర్జున్​.. విశ్వక్​ సేన్​ కొత్త సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.

తెలుగు, త‌మిళం, క‌న్న‌డలో హీరోగా ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల్లో నటించి.. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు అర్జున్​. తెలుగులో ర‌వితేజ న‌టించిన 'ఖిలాడీ' చిత్రంలో కీల‌క పాత్ర‌లో క‌నిపించారు. మరో విషయమేమిటంటే.. అర్జున్ కుమార్తె ఐశ్వర్య ఈ సినిమా ద్వారా తెరంగేట్రం చేస్తున్నారు. ఆదివారం.. మేక‌ర్స్ ఈ ప్రాజెక్ట్​ను అధికారికంగా ప్ర‌క‌టించారు. కాగా, ఈ మూవీలో జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

ఇవీ చదవండి:వారంతా సెట్.. నేనొక్కడినే ఇలా.. హిట్ కొట్టగానే...: హీరో ప్రిన్స్​

అక్కడ 'బాహుబలి 2' రికార్డును బ్రేక్​ చేసిన కమల్​ 'విక్రమ్'​

ABOUT THE AUTHOR

...view details