Kushi Music Concert Live : టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న సమంత ప్రస్తుతం ఏడాదిపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వెకేషన్ ట్రిప్‌లో తన స్నేహితురాతిలో కలిసి ఫుల్ ఎంజాయ్ చేసిన సామ్ ప్రస్తుతం తాజాగా హైదరాబాద్‌కు చేరుకుంది. అయితే సామ్ చివరిగా 'శాకుంతలం'తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్‌ను అందుకుంది. దీంతో తన కొత్త సినిమా 'ఖుషి' మూవీతో ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని గట్టిగా ప్రయత్నిస్తోంది.
Kushi Music Concert : ఈ సినిమాలో హీరో ది విజయ్ దేవరకొండతో కలిసి నటించింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. బిగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపుదిద్దుకుంది. సెప్టెంబర్ 1న అన్ని భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మూవీటీమ్.. ప్రమోషన్స్‌లో భాగంగా నేడు ఆగస్ట్ 15 హైదరాబాద్‌లోని HICC సెంటర్లో Kushi Music Concertను నిర్వహించింది. ఈవెంట్లో సామ్- విజయ్ సహా పలువురు హాజరై సందడి చేశారు.
ఈ క్రమంలోనే మ్యూజిక్ కాన్సెర్ట్ కోసం సామ్ నయా లుక్స్‌లో మెరిసింది. కొత్త ఫొటోషూట్ కూడా పోస్ట్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఓ ట్రెండీ వేర్ డ్రెస్‌లో మెరిసింది. అలాగే అంతకుముందు రోజు కూడా వైట కలర్ స్టైలిష్ ఔట్ఫిట్లో ఆకట్టుకుంది. తన ఫ్యాషన్ సెన్స్‌ను చూపిస్తూ స్టన్నింగ్ స్టిల్స్‌తో మెస్మరైజ్ చేసింది. చాలా కాలం తర్వాత ఇలా స్టైలిష్‌గా, స్టన్నింగ్‌గా మెరిసింది. దీంతో సామ్ గ్లామర్ మెరుపులు చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్.. ఫుల్ ఖుషీ అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో కామెంట్ బాక్స్ సెక్షన్‌ను హోరెత్తిస్తున్నారు. మైండ్ బ్లోయింగ్‌గా ఫొటోషూట్లు ఉన్నాయని చెబుతున్నారు.