తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Samantha Health Update : 'మాటిస్తున్నా.. తప్పకుండా తిరిగొస్తా'.. స్టేజ్​పైనే సామ్​ ఎమోషనల్​ - samantha health news

Kushi Music Concert Live Samantha Health Update : ఖుషి మూవీ మ్యూజిక్ కాన్సెర్ట్ ఈవెంట్​లో సమంత తన హెల్త్ గురించి కాస్త ఎమోషనల్ అయింది. ఏం అన్నదంటే?

Kushi Music Concert Live samantha health
Kushi Music Concert Live samantha health

By

Published : Aug 15, 2023, 10:49 PM IST

Kushi Music Concert Live Samantha Health Update : ఖుషి మూవీటీమ్.. ప్రమోషన్స్​లో భాగంగా నేడు ఆగస్ట్ 15 హైదరాబాద్​లోని HICC సెంటర్​లో Kushi Music Concertను నిర్వహించింది. ఈవెంట్​లో సామ్- విజయ్ సహా పలువురు హాజరై సందడి చేశారు. ఈ ఈవెంట్​లో సమంత మాట్లాడుతూ.. "షూటింగ్​లో ఈ సాంగ్స్​ విన్నప్పుడు నుంచి ఈ ఆల్బమ్​తో ప్రేమలో పడిపోయాను. ఇవాళ నేను లైవ్​లో మీ అందరూ సాంగ్స్​ను ఎంజాయ్ చేయడం చూసి నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ రాత్రి ఎంతో స్పెషల్​ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ ఎనర్జీ చూశాక సెప్టెంబర్​ 1న మీతోనే సినిమా చూడాలని ఉంది. ఎప్పుడూ మీకు నచ్చిన ఓ మంచి సినిమా తీయాలనేదే మా ప్రయ్తత్నం. అలాంటి సినిమానే తీశానని నమ్ముతున్నాను. సినిమాకు మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. మైత్రీమూవీ మేకర్స్​తో పాటు మిగతా మూవీటీమ్​కు కృతజ్ఞతలు. మీరు చూపించిన ప్రేమ, సహనం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను." అని సమతం చెప్పింది.

అలాగే మొన్న ట్రైలర్ లాంఛ్​ ఈవెంట్​ విజయ్, దర్శకుడు శివ నిర్వాణ్​.. సమంత గురించి మాట్లాడుతూ చేసిన ఇడ్లీ స్టాల్​ కామెంట్స్​కు ఇప్పుడు మాట్లాడింది సమంత. "శివ, విజయ్​కు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ గాడ్​. మీకు విజయవాడంలో సమంత ఇడ్లీ స్టాల్​ పెట్టే అవసరం రాలేదు. టైమ్​కు వచ్చి నేను సినిమా పూర్తి చేశాను. ఎందుకంటే ఈ ఇడ్లీ బిజినెస్​ చేసేంత సామర్థ్యం మీ ఇద్దరికి ఉందో లేదో డౌట్ ఉంది. కానీ ఓ బ్లాక్​ బస్టర్​ సినిమా తీసే కేపబిలిటీపై మాత్రం అస్సలు డౌట్ లేదు. ఇది కష్ట కాలం అని తెలుసు. కానీ థ్యాంక్యూ నన్ను సినిమాలో భాగం చేసినందుకు. సినిమా టీమ్​ మొత్తం నాకు మంచి కాన్ఫిడెన్స్​ ఇచ్చారు. ప్రతిఒక్కరికీ ధన్యావాదాలు." అని చెప్పింది. తన ఆరోగ్యం గురించి సామ్(Samantha health news) మాట్లాడుతూ.. "ఏమి చెప్పాలో తెలియట్లేదు. మీ కోసం హార్డ్ వర్క్​ చేస్తున్నాను. తిరిగి హెల్తీగా వస్తాను బ్లాక్​ బస్టర్​ ఇస్తాను. మీకు ప్రామిస్ చేస్తున్నాను." అని కాస్త ఎమోషనల్​ అయినట్లు మాట్లాడింది.

Kushi Movie Release Date : ఇకపోతే ఈ రొమాంటిక్ లవ్​ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్​ హైలైట్​గా నిలిచాయి. నా రోజా నువ్వే, ఆరాధ్య సాంగ్స్​ సోషల్​మీడియాలో ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం బాగా ప్లస్ అయింది. ట్రైలర్ కూడా బాగానే మెప్పించింది.

Kushi Pre Release Business : 'లైగర్'​ దెబ్బేసినా 'ఖుషి'కి డిమాండ్​ ఎక్కువే.. ప్రీ రిలీజ్ బిజినెస్​ ఏకంగా ఎన్ని కోట్లంటే?

బ్రేక్ తర్వాత సమంత చేయబోయే మొదటి పని ఇదేనటా... ఆబ్బో ప్లానింగ్ బాగానే ఉందిగా!

ABOUT THE AUTHOR

...view details