తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

హృదయాన్ని హత్తుకునేలా 'రంగమార్తాండ' ట్రైలర్‌ - కృష్ణవంశీ రంగమార్తాండ రిలీజ్ డేట్​

ప్రకాశ్‌రాజ్‌, బ్రహ్మానందం, రమ్యకృష్ణ.. తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'రంగమార్తాండ'. దర్శకుడు కృష్ణవంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 22న రిలీజ్​ కానుంది. ఈ సందర్భంగా మూవీటీమ్​ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం హృదయాన్ని హత్తుకునేలా సాగింది. ఓ సారి మీరు చూసేయండి..

Rangamartandha Trailer
హృదయాన్ని హత్తుకునేలా 'రంగమార్తాండ' ట్రైలర్‌..

By

Published : Mar 20, 2023, 6:10 PM IST

Updated : Mar 20, 2023, 6:26 PM IST

ప్రకాశ్‌రాజ్‌, బ్రహ్మానందం, రమ్యకృష్ణ.. తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'రంగమార్తాండ'. దర్శకుడు కృష్ణవంశీ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీటీమ్​ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం హృదయాన్ని హత్తుకునేలా సాగింది. ఈ ప్రచార చిత్రంలో సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచేశారు కృష్ణవంశీ.

రంగస్థల నటుడిగా తన గత వైభవాన్ని ప్రకాశ్ రాజ్ గుర్తుచేసుకునే నేపథ్యంలో ప్రారంభమైన ఈ ప్రచార చిత్రం.. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులే తనకు ఎదురు తిరగడం.. సొంత కూతురే తనను దొంగగా అనుమానించడం వంటి సంఘటనలను తట్టుకోలేక భార్య రమ్యకృష్ణతో కలిసి మరో జీవితాన్ని మొదలుపెట్టడం ఈ ట్రైలర్​ చూస్తే కనిపిస్తోంది. ముఖ్యంగా రమ్యకృష్ణ-ప్రకాశ్ రాజ్​.. బ్రహ్మానందం-ప్రకాశ్​ రాజ్​ మధ్య సాగే ఎమోషన్స్​, డైలాగ్స్​ హైలైట్​గా నిలిచాయి. ఎప్పుడూ నవ్విస్తూ హాస్యం పండించే బ్రహ్మానందం.. తన డైలాగ్స్​తో భావోద్వేగానికి గురిచేశారు. మొత్తంగా.. జీవితంలో​ నటనను ప్రాణంగా భావించే ఒక రంగస్థల కళాకారుడి అనుభవాలు.. జ్ఞాపకాలను.. సినిమాగా రూపొందించారు. అనుభూతులకు, భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇస్తూ కథను నడిపించారు.

ఇకపోతే ఈ సినిమాను హౌస్​ఫుల్​ మూవీస్, రాజశ్యామల ఎంటర్​టైన్మెంట్స్​ బ్యానర్​పై నిర్మించారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణవంశీ.. ఈ చిత్రంలో తన భార్య, సీనియర్​ నటి రమ్యకృష్ణ పోషించిన పాత్రకు సంబంధించి ఓ ఇంట్రెస్ట్​ విషయాన్ని తెలిపారు. ఆమెకు సంబంధించిన సన్నివేశాన్ని 36 గంటల పాటు చిత్రీకరించినట్లు పేర్కొన్నారు. సెంటిమెంట్‌ అడ్డొచ్చినా సినిమాకే హైలైట్​గా నిలిచేది అవ్వడం వల్ల ఆ సీన్​ను తీయక తప్పలేదని చెప్పుకొచ్చారు. నేటివిటీని దృష్టిలో పెట్టుకుని స్క్రిప్టును కొత్తగా రాసిటన్లు వెల్లడించారు.

ఇంకా ఈ చిత్రంలో శివాత్మిక రాజ శేఖర్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ తదితరులు కూడా ఈ చిత్రంలో యాక్ట్ చేశారు. మెగాస్టార్​ చిరంజీవి ఓ షాయరీని ఆలపించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రివ్యూలను కూడా ప్రదర్శించారు. దర్శకులు శేఖర్‌ కమ్ముల, హరీశ్‌ శంకర్‌, బి. గోపాల్‌, దేవ కట్టా, బుచ్చిబాబు, నందిని రెడ్డి, అనుదీప్‌ కె. వి. తేజతో పాటు పలువురు ఈ సినిమా చూసి తమ అభిప్రాయాన్ని వ్యక్తం పరిచరు. సినిమా అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. ఇతర సెలబ్రిటీలు కూడా ప్రశంసిస్తూ.. చిత్రాన్ని వివరిస్తూ ట్వీట్స్ కూడా చేశారు. ముఖ్యంగా బ్రహ్మానందం పోషించిన పాత్ర ఎంతో భావోద్వేగానికి గురిచేస్తుందని చెప్పారు.

ఇదీ చూడండి:Rangamarthanda: 'ఆ ఒక్క సీన్​ను 36 గంటల పాటు షూట్‌ చేశాం'

Last Updated : Mar 20, 2023, 6:26 PM IST

ABOUT THE AUTHOR

...view details