పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ బుడ్డోడు ఇప్పుడు ఇండస్ట్రీలో హ్యాండ్సమ్ హీరో. ఈ చిన్నోడికి అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఎక్కువే. క్యూట్ లుక్స్‌తో, లవర్ బాయ్‌లా అమ్మాయిల గుండెల్లో గిలిగింతలు పెట్టాడు. తొలి సినిమాతోనే ఎట్రాక్ట్ చేసి వరుస అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. మొదట లవర్‌బాయ్‌గా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరైనా ఆ తర్వాత మాస్ ఆడియెన్స్‌కు చేరువయ్యాడు. ప్రస్తుతం తన కొత్త సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా. మీకోసం మరో క్లూ. తెలుగు పరిశ్రమలో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఈ కుర్రాడు ఒకడు.
ఈ బుడ్డోడు అమ్మాయిల మనసు దోచిన యంగ్ హీరో.. ఎవరో గుర్తుపట్టగలరా? - కృష్ణ వింద్ర విహారి రిలీజ్ డేట్
పై ఫొటోలో ఉన్న బుడ్డోడు.. ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లో ఒకడు. తొలి సినిమాతోనే లవర్‌బాయ్‌గా కనిపించి అమ్మాయిల ఫాలోయింగ్‌ను పెంచుకున్నాడు. ఎవరో గుర్తుపట్టగలరా?
ఇతడు మరెవరో కాదు యంగ్ హీరో నాగశౌర్య. 'చందమామ కథలు' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి 'ఊహలు గుసగుసలాడే' అంటూ అమ్మాయిల మనసు దోచేశాడు. 'కల్యాణ వైభోగమే' 'దిక్కులు చూడకు రామయ్యా' 'జ్యో అచ్యుతానంద' 'ఒక మనసు' చిత్రాతో ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ఆడియన్స్‌కి కూడా దగ్గరయ్యాడు. ఇటీవలే 'లక్ష్య'లో ఎయిట్ ప్యాక్ బాడీతో తనలోని కొత్త కోణాన్ని చూపించాడు. వరుడు కావలెనుతో మంచి హిట్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో 'కృష్ణ వ్రింద విహారి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 23న విడుదల కానుంది. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మించారు. షిర్లీ సెటియా కథానాయికగా నటించింది.
ఇదీ చూడండి: విలన్‌గా అల్లరోడి అన్న.. ఆ బడా డైరెక్టర్‌తో సినిమా!