తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కొరటాల- చరణ్​ కాంబినేషన్​లో మూవీ! కేజీఎఫ్​-3లో హృతిక్‌ రోషన్‌! - hrithik roshan new movie

కొరటాల శివ- రామ్​చరణ్​ కాంబినేషన్​లో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్​తో కొరటాల సినిమా పూర్తయ్యాక్ వీరి మూవీ పట్టాలెక్కనున్నట్లు సమాచారం. అలాగే కేజీఎఫ్​-3కి సంబంధించిన క్రేజీ రూమర్​ ఒకటి సోషల్​మీడియాలో చక్కర్లు కొడుకుతోంది.

Koratala Shiva - Movie in combination with Charan! Hrithik Roshan in KGF3!
కొరటాల- చరణ్​తో కాంబినేషన్​లో మూవీ! కేజీఎఫ్​3లో హృతిక్‌ రోషన్‌!

By

Published : May 31, 2022, 1:15 PM IST

Updated : May 31, 2022, 2:08 PM IST

చిరంజీవి- రామ్​చరణ్​ కాంబినేషన్​లో దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన 'ఆచార్య' సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేదు. అయితే ఆ సినిమా సమయంలో చరణ్ కోసం ఒక కథను సిద్ధం చేసుకున్నారు కొరటాల. ఆ కథ సైతం చరణ్​కు నచ్చిందట. ఎన్టీఆర్​తో చేసే సినిమా పూర్తయ్యాక.. తర్వాత చరణ్​తో ఆ మూవీ తీయాలనుకున్నారట కొరటాల. 'ఆచార్య' నిరాశ పర్చడం వల్ల.. ఈ ప్రాజెక్ట్​ ముందుకెళ్తుందా? లేదా? అనే సందిగ్ధిత నెలకొంది. 'ఆచార్య'ను మరిచిపోయి.. కొరటాలతో అంతకుముందు ఓకే చెప్పిన ప్రాజెక్టును సెట్స్​పైకి తెసుకెళ్లేందుకు చరణ్​ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

కేజీఎఫ్​-3 రూమర్​..

కన్నడ హీరో యశ్​తో ప్రశాంత్​నీల్​ సృష్టించిన ప్రభంజనం కేజీఎఫ్​-1, కేజీఎఫ్​-2. ప్రస్తుతం ప్రభాస్​తో సలార్​ సినిమా బీజీలో ఉన్నారు ప్రశాంత్​. భవిష్యత్​ కేజీఎఫ్​-3 ఉంటుందని చెప్పారు ప్రశాంత్​. వాస్తవానికి మూడో సీక్వెల్​ను ఇప్పట్లో తెరకెక్కించే ఆలోచన లేదని అటు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్​ చెప్పినా.. ఆ సినిమాపై మాత్రం పలు రూమర్లు ఆగడం లేదు. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్​ స్టార్​ హృతిక్​రోషన్​ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. యశ్​ స్థానంలో హృతిక్​ను తీసుకొని.. నేరుగా బాలీవుడ్​లో సినిమాను తీయాలని ప్రశాంత్​ భావిస్తున్నట్లు వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.

ఇదీ చదవండి:ఈ వారం థియేటర్‌/ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే..

Last Updated : May 31, 2022, 2:08 PM IST

ABOUT THE AUTHOR

...view details