తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Kollywood Heroes Red Card : ఆ స్టార్ హీరోలకు బిగ్​ షాక్​!.. వారందరికి రెడ్ కార్డ్​.. ఏం తప్పు చేశారంటే? - కోలీవుడ్ హీరోస్​కు షాక్ రెడ్ కార్డ్ జారీ

Kollywood Heroes Red Card : కోలీవుడ్​కు చెందిన నలుగురు స్టార్‌ హీరోలకు అక్కడి నిర్మాతల మండలి బిగ్​ షాక్‌ ఇవ్వనుంది! వారికి రెడ్ కార్డ్ జారీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

Kollywood Heroes Red Card : ఆ స్టార్ హీరోలకు బిగ్​ షాక్​.. వారందరికి రెడ్ కార్డ్​.. ఏం తప్పు చేశారంటే?
Kollywood Heroes Red Card : ఆ స్టార్ హీరోలకు బిగ్​ షాక్​.. వారందరికి రెడ్ కార్డ్​.. ఏం తప్పు చేశారంటే?

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2023, 4:25 PM IST

Updated : Sep 14, 2023, 6:11 PM IST

Kollywood Heroes Red Card : కోలీవుడ్‌ స్టార్‌ హీరోలకు తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి బిగ్​ షాక్‌ ఇవ్వనుంది! ధనుశ్, విశాల్‌, అథర్వ, శింబు లాంటి స్టార్ హీరోలకు రెడ్‌ కార్డు జారీ చేసేందుకు రెడీ అయినట్లు తెలిసింది. తాజాగా జరిగిన సర్వసభ్య సమావేశంలో తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది

ప్రొడ్యూసర్​ మైఖేల్‌ రాయప్పన్‌తో వచ్చిన వివాదాల నేపథ్యంలో శింబుకు రెడ్‌ కార్డు జారీ చేయనున్నారు. ఎందుకంటే ఈ వివాదంపై ఇప్పటికే చాలా సార్లు చర్చలు జరిపిన కూడా శింబు నుంచి ఎలాంటి మార్పు రావట్లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నిర్మాత అసోసియేషన్‌కు ప్రెసిడెంట్​గా వ్యవహరించిన సమయంలో అసోసియేషన్‌ ఫండ్స్​ను విశాల్‌ దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఆయనకు రెడ్‌ కార్డు జారి చేయనున్నారు. తెనందాల్‌ ప్రొడక్షన్ హౌస్​లో ధనుశ్​ ఓ సినిమాకు అంగీకరించారని.. 80 శాతం షూట్‌ పూర్తయ్యాక.. ఆ తర్వాత షూటింగ్ విషయంలో ఇంట్రెస్ట్ చూపలేదంట. దీంతో ఆ నిర్మాతకు నష్టాలు వచ్చినట్లు మండలి తెలిపింది. అందుకే ఆ కారణాన్ని చూపిస్తూ.. ధనుశ్​పై​ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఇక మదియలకన్‌ ప్రొడక్షన్ హౌస్​తో అథర్వ ఓ చిత్రానికి ఓకే చేశారని.. కాకపోతే షూటింగ్‌ విషయంలో ఆయన ఏమాత్రం సహకరించడం లేదంటూ.. అథర్వకు రెడ్‌ కార్డు ఇవ్వనున్నట్లు తెలిపింది.

ఇకపోతే ప్రస్తుతం ధనుశ్, విశాల్‌, అథర్వ, శింబు.. ఈ నలుగురు హీరోలు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ధనుశ్ త్వరలోనే కెప్టెన్ మిల్లర్​తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆ తర్వాత తన స్వీయ దర్శకత్వంలో 50వ చిత్రంలో నటించనున్నారు. విశాల్​ మరో రోజులో(సెప్టెంబర్​ 15) మార్క్ ఆంటోని చిత్రంతో అభిమానులను అలరించనున్నారు. ఆ తర్వాత తుప్పారివాలన్​తో పాటు మరో చిత్రం చేస్తున్నారు. ఇక శింబు తన 48వ చిత్రంతో పాటు కరోనా కుమార్ అనే సినిమాలో నటిస్తున్నారు. అధ్వర.. అడ్రెస్​, తనల్​, నిరంగల్​ మూండ్రు అనే సినిమాలు చేస్తున్నారు.

Movie Director With No Flops : ప్ర‌తి సినిమా రూ.100 కోట్ల క‌లెక్ష‌న్‌.. ఒక్క ఫ్లాప్ లేని దర్శకుడు ఎవరంటే?

Mark Antony Stay Order : కోర్టులో హీరో విశాల్​కు ఊరట.. ఆ రోజే 'మార్క్​ ఆంటోని' రిలీజ్

Last Updated : Sep 14, 2023, 6:11 PM IST

ABOUT THE AUTHOR

...view details