తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

స్టార్ హీరో కాదు.. కానీ ఈ యాక్టర్​​ చివరి మూడు సినిమాల కలెక్షన్లు రూ.1900 కోట్లు! - జాఫర్​ సాదిక్​ జవాన్ మూవీ

Actor With 1900 Crore Earnings : సౌత్ నుంచి నార్త్ వరకు ఎందరో నటీనటులు తమ యాక్టింగ్​తో సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేస్తుంటారు. అయితే ఓ యాక్టర్ నటించిన చివరి చిత్రాలు ఏకంగా రూ.1900కోట్ల వరకు వసూలు చేశాయి. ఇంతకీ ఆయన ఎవరంటే ?

Actor With 1900 Crore Earnings
Actor With 1900 Crore Earnings

By ETV Bharat Telugu Team

Published : Oct 17, 2023, 12:47 PM IST

Jaffer Sadiq Movies :సౌత్ నుంచి నార్త్ వరకు ఎందరో నటీనటులు తమ యాక్టింగ్​తో సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేస్తుంటారు. దీని ద్వారా స్టార్​డం తెచ్చుకోవడమే కాకుండా బాక్సాఫీస్​ వద్ద తమ చిత్రాలతో భారీ స్థాయిలో వసూళ్లను అందుకుంటుంటారు. తాజాగా విడుదలైన 'జైలర్',​ 'జవాన్' ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ అంచానలతో వచ్చిన ఈ చిత్రాలు రికార్డు కలెక్షన్లను అందుకున్నాయి. అయితే ఈ రెండు సినిమాల్లో కీలక పాత్ర పోషించిన ఓ వ్యక్తి ఒకరున్నారు. 27 ఏళ్ల ఆ వ్యక్తి .. తాను నటించిన చివరి 3 చిత్రాల ద్వారా దాదాపు రూ. 2 వేల కోట్ల కలెక్షన్లను అందుకున్నారు. అతనే కోలీవుడ్ నటుడు జాఫర్​ సాదిక్​.

Jaffer Sadiq Career :త‌మిళ‌నాడుకు చెందిన ఈ యాక్ట‌ర్..1995లో జన్మించారు. 'పావ కాదైగల్' అనే తమిళ సిరీస్​ ద్వారా తన కెరీర్​ను ప్రారంభించారు. ఆ తర్వాత 2022 లో క‌మ‌ల్ హాస‌న్- లోకేశ్​ క‌న‌గ‌రాజ్ కాంబినేషన్​లో వచ్చిన 'విక్ర‌మ్'​ సినిమాతో వెండితెర తెరంగేట్రం చేశారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా అదే రేంజ్​లో సక్సెస్​ను అందుకుని బాక్సాఫీస్​ వద్ద్ రూ. 414 కోట్ల వ‌సూళ్లను సాధించింది.

Jaffer Sadiq Jailer Movie :ఆ తర్వాత ర‌జ‌నీకాంత్ లీడ్​ రోల్​లో తెరకెక్కిన 'జైల‌ర్' సినిమాలో హీరోకు స‌పోర్టింగ్ రోల్​లో కనిపించారు. ఇది కూడా బాక్సాఫీస్​ వద్ద మంచి కలెక్షన్లు అందుకుంది. ఇక ఇటీవలే వచ్చిన 'జవాన్ కూడా మంచి హిట్​ టాక్ అందుకుంది. ఇదీ దాదాపు రూ. వెయ్యి కోట్లు సాధించి ఇండ‌స్ట్రీ హిట్​గా నిలిచింది. ఇలా వరుస సినిమాల హిట్​తో హ్యాట్రిక్ అందుకున్న ఈ నటుడు​.. తన యాక్టింగ్​తో అందరి దృష్టిలో పడ్డారు. త‌న అద్భుతమైన న‌ట‌న ప్ర‌తిభతో, వినూత్నమైన క‌థ‌ల ఎంపిక‌తో మంచి జాఫర్​ మంచి విజ‌యాలు సాధిస్తున్నారు. చిన్న వ‌య‌సులోనే ఎంతో మందికి సాధ్యం కాని రికార్డుల‌ను ఈ యంగ్ స్టార్ త‌న పేరు మీద లిఖించుకుంటున్నారు. ఇత‌ర యువ నటుల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.

Jawan Box Office Collection Worldwide : జవాన్ కలెక్షన్ల సునామీ.. రూ. 1000 కోట్ల క్లబ్​లోకి ఎంట్రీ

Jailer Gold Coins : 'జైలర్' సక్సెస్ సెలబ్రేషన్స్.. 300 మందికి గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్​.. బిర్యానీ పెట్టించి మరీ

ABOUT THE AUTHOR

...view details