తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

King Of Kotha Movie : రియల్ పాన్ ఇండియా స్టార్ దుల్కర్ మాత్రమే : హీరో నాని - కింగ్ ఆఫ్​ కొత్త సినిమా డైరెక్టర్

King Of Kotha Movie : దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా.. డైరెక్టర్ అభిలాష్‌ జోషి 'కింగ్ ఆఫ్​ కొత్త' సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించారు. ఈ సినిమాలో దుల్కర్​కు జోడీగా హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ నటించింది. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్​ ఈవెంట్​ను మూవీమేకర్స్ ఆదివారం హైదారాబాద్​లో నిర్వహించారు. కాాగా ఈ సినిమా ఆగస్ట్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్​గా రిలీజ్​ కానుంది.

king of kotha movie
కింగ్ ఆఫ్ కొత్త సినిమా

By

Published : Aug 14, 2023, 7:51 AM IST

King Of Kotha Movie :సీతారామం హీరో దుల్కర్‌ సల్మాన్‌ - దర్శకుడు అభిలాష్‌ జోషి కాంబినేషన్​లో తెరకెక్కిన సినిమా 'కింగ్ ఆఫ్ కొత్త'. పాన్ ఇండియా లెవెల్​లో రూపొందిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదారాబాద్​లో ఆదివారం ఘనంగా జరిగింది. కాగా ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరోలు దగ్గుబాటి రానా, నాని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హీరో నాని మాట్లాడుతూ.. పాన్ ఇండియా సినిమాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మరి నాని ఏమన్నాడంటే..

"ప్రస్తుతం అందరూ పాన్ ఇండియా సినిమా అంటున్నారు. కానీ నాకు ఆ పదం నచ్చదు. కానీ రియల్ పాన్ ఇండియా స్టార్ మాత్రం దుల్కరే. ఎందుకంటే తన కోసం తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ, కన్నడ అన్ని భాషల డైరెక్టర్లు కథ రాస్తారు. ఇది కదా అసలైన పాన్ ఇండియా స్టార్​కు అర్థం. ఈ సినిమా ('కింగ్ ఆఫ్ కొత్త') ట్రైలర్ బాగుంది. సినిమా కూడా సక్సెస్​ అవ్వాలని కోరుకుంటున్నా" అని నాని అన్నారు. అలాగే దుల్కర్​ సల్మాన్, తనకు మధ్య ఉన్న అనుబంధం గురించి నాని చెప్పుకొచ్చారు. దుల్కర్ నటించిన 'ఓకే బంగారం' సినిమాకు తెలుగు డబ్బింగ్ చెప్పింది తనేనంటూ నాని ఈ వేదికపై గుర్తుచేసుకున్నారు.

అలాగే వేడుకకు హాజరైన మరో స్టార్ హీరో రానా మాట్లాడుతూ.. " యాక్టింగ్ స్కూల్​లో దుల్కర్ నా జూనియర్. తను చాలా పద్ధతిగా ఉంటాడు. ఇప్పుడు తను 'కింగ్ ఆఫ్ కొత్త' లాంటి ఓ వైల్డ్ యాక్షన్ సినిమా చేయడం నాకు హ్యాపీగా ఉంది" అని అన్నారు. కాగా 'కింగ్ ఆఫ్ కొత్త' తన డ్రీమ్​ ప్రాజెక్ట్​ అంటూ దుల్కర్ సల్మాన్ చెప్పుకొచ్చారు. కెరీర్​లో ఇది పెద్ద సినిమాగా నిలుస్తుందని దుల్కర్ అన్నారు. అయితే ఈ సినిమాకు నాలుగు భాషల్లో డబ్బింగ్ తనే చెప్పుకున్నాడట. ఇక ఈ సినిమా అందరికి నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు దుల్కర్.

ఇక ఈ సినిమాలో దుల్కర్​ సల్మాన్​కు జోడీగా హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ నటించారు. రితికా సింగ్, అనికా సురేంద్రన్, ధ్రువ్ విక్రమ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జీ స్టూడియోస్‌, వేఫేరర్‌ ఫిల్మ్స్​ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ఆగస్ట్ 24న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

ABOUT THE AUTHOR

...view details