తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

నాగార్జున ధైర్యం చేయడం వల్లే అది సాధ్యమైంది: స్టార్​ హీరో

Kicha sudeep Vikranth Rona movie trailer: స్టార్​ హీరో కిచ్చ సుదీప్ నటించిన 'విక్రాంత్​ రోనా' ట్రైలర్​ లాంఛ్​ వేడుక ఘనంగా జరిగింది. ఈ సంద్భంగా కార్యక్రమంలో ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, దర్శకుడు రాంగోపాల్‌ వర్మ, నటుడు అఖిల్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

kicha sudeep nagarjuna
నాగార్జున కిచ్చా సుదీప్​

By

Published : Jun 25, 2022, 4:50 PM IST

Updated : Jun 25, 2022, 4:57 PM IST

Kicha sudeep Vikranth Rona movie trailer: కన్నడ స్టార్​ కిచ్చ సుదీప్​ హీరోగా తెరకెక్కిన పాన్​ ఇండియా సినిమా 'విక్రాంత్​ రోనా'. జులై 28న తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడతో పాటు మరో ఐదు విదేశీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అనూప్​ భండారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జాన్​ మంజునాథ్​, షాలిని మంజునాథ్​ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర 3డీ ట్రైలర్‌ విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, దర్శకుడు రాంగోపాల్‌ వర్మ, నటుడు అఖిల్‌ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా హీరో సుదీప్‌ మాట్లాడుతూ.. "మా చిత్రాన్ని సపోర్ట్‌ చేయడానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఎంతోమంది కలిస్తేనే ఈ సినిమా సిద్ధమైంది. నాలుగేళ్లుగా అనూప్‌ నేనూ కలిసి పనిచేస్తున్నాం. రోణ పాత్ర తీర్చిదిద్దడానికే మాకెంతో సమయం పట్టింది. సినిమా ప్రారంభించిన కొంతకాలానికే కరోనా రావడంతో షూట్‌ నిలిచిపోయింది. అలాంటి సమయంలో మేమంతా హైదరాబాద్‌కు వచ్చి సుమారు రెండు నెలలు అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే ఉన్నాం. నాగార్జున ధైర్యం చేసి మాకోసం స్టూడియో తలుపులు తీశారు. ఒక్క కరోనా కేసు కూడా లేకుండా సినిమా షూట్‌ పూర్తి చేశాం. మాతో పాటు షూట్‌ ప్రారంభించిన చాలామంది మూడు, లేదా నాలుగు రోజులు చేయగానే కరోనా కేసులు రావడంతో వాయిదా వేసుకున్నారు. రాజమౌళి, విజయేంద్రప్రసాద్ ఇచ్చిన ‘ఈగ’ వల్లే నన్ను ఇక్కడి ప్రేక్షకులందరూ గుర్తుపడుతున్నారు. అందుకు వాళ్లకు ధన్యవాదాలు" అని సుదీప్‌ అన్నారు.

అఖిల్‌ మాట్లాడుతూ.. "విక్రాంత్‌రోణ ట్రైలర్‌ చూసినప్పుడే ఇది ఫ్యూచర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా అనిపించింది. ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన టీమ్‌ మొత్తానికి అభినందనలు. సుదీప్‌ నాకు పదేళ్ల నుంచి తెలుసు.. లుక్స్‌, వాయిస్‌ మాత్రమే కాదు ఆయన మైండ్‌ కూడా ఎంతో పవర్‌ఫుల్‌. ఒక యువ నటుడిగా ఎప్పుడూ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుంటా. ఇలాంటి సినిమాలతో మాలో స్ఫూర్తి నింపుతున్నందుకు ఆయనకు ధన్యవాదాలు. కన్నడ పరిశ్రమ నుంచి మరో రికార్డ్స్‌ క్రియేట్‌ చేసే మూవీ ఇది అవుతుందని నమ్ముతున్నా. మనమంతా సౌత్‌ ఇండియన్స్‌ అయినందుకు గర్వంగా ఉంది" అని అన్నారు.

ఆర్జీవీ మాట్లాడుతూ.. "కన్నడ సినిమాలకు మొదట్లో ఆదరణ తక్కువ. కానీ, ఇప్పుడు ‘కేజీయఫ్‌’తో కన్నడ చిత్రపరిశ్రమ ఇండియా మొత్తానికి ఒక బెంచ్‌ మార్క్‌ క్రియేట్‌ చేసింది. ‘విక్రాంత్‌రోణ’ రఫ్‌ వెర్షన్‌ చూశా. కథ‌, సుదీప్‌ నటన, అనూప్‌ తెరకెక్కించిన విధానం నన్నెంతో ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇలాంటి అత్యద్భుతమైన ఫైట్‌ సీక్వెన్స్‌లను ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడలేదు. ఇందులోని ఓ పాట, దాన్ని తెరకెక్కించిన విధానం అదుర్స్. జాక్వెలిన్‌ డ్యాన్స్‌ కన్నా మంగ్లీ వాయిస్‌ సూపర్‌గా ఉంది. సుదీప్‌ కెరీర్‌లోనే ఇది ది బెస్ట్‌ ప్రాజెక్ట్‌ అవుతుందనుకుంటున్నా" అని తెలిపారు.

"అక్కినేని కుటుంబంతో నాకెంతో మంచి అనుబంధం ఉంది. నేను చూసిన మొదటి తెలుగు సినిమా 'గీతాంజలి'. నా మొదటి రెండు చిత్రాల పోస్ట్‌ ప్రొడెక్షన్‌ పనులు అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే జరిగాయి. అలాగే, ఇప్పుడీ 'విక్రాంత్‌రోణ' షూట్‌ కూడా చాలా వరకూ ఇక్కడే జరిగింది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫుటేజీలను నాగార్జున చూసి వ్యక్తిగతంగా నన్ను పిలిచి, ప్రశంసించారు. నేను ఎంతగానో అభిమానించే నటుడి నుంచి ప్రశంసలు రావడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. రామ్‌గోపాల్‌ వర్మ కూడా మా చిత్రానికి ఎంతగానో సపోర్ట్‌ చేస్తున్నారు. విజయేంద్రప్రసాద్‌.. ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్‌ చేయడం ఆనందంగా ఉంది’"అని చిత్ర దర్శకుడు అనూప్‌ తెలిపారు.

ఇదీ చూడండి: ఆకట్టుకుంటున్న దుల్కర్​ 'సీతారామం' టీజర్​.. బన్నీతో మూవీకి హరీశ్​ ప్లాన్​!

Last Updated : Jun 25, 2022, 4:57 PM IST

ABOUT THE AUTHOR

...view details