తెలంగాణ

telangana

By

Published : Apr 26, 2022, 10:49 PM IST

ETV Bharat / entertainment

రాఖీభాయ్​ రాజసం.. రూ.కోట్ల విలువైన కార్లు.. అదిరిపోయే ఇల్లు​

KGF Yash: టీవీ సీరియల్‌ నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన కన్నడ నటుడు యశ్‌.. 'కేజీఎఫ్‌' సినిమాతో పాన్‌ ఇండియా హీరోగా మారిపోయారు. రాఖీబాయ్​ నటనకు ఫిదా అయిన అభిమానులు.. అతడికోసం తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు. మరి అతడి లైఫ్​స్టైల్​పై ఓ లుక్కేయండి..

Yash
Yash

KGF Yash: 'కేజీఎఫ్‌-2' బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమాతో విజయాన్ని తన ఇంటిపేరుగా మార్చుకున్నారు యశ్‌. ఈ సినిమా సాధించిన విజయంతో కన్నడ హీరో యశ్ పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయారు. రాఖీభాయ్‌గా స్టైల్‌, యాక్షన్‌తో అద్భుతంగా డైలాగ్స్‌ చెప్పి యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్న ఈ స్టార్‌ హీరో గురించి తెలుసుకోవాలని అభిమానులు వెబ్‌సైట్స్‌లో తెగ వెతికేస్తున్నారు. కేజీయఫ్‌ స్టార్‌ ఎక్కడ ఉంటాడు? ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్‌ ఎంత తీసుకుంటారు? ఏ కారును వాడతారో అందరికీ తెలుసుకోవాలని ఉంది.

యశ్​

విలాసవంతమైన భవనం, ఖరీదైన కార్లు.. ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న యశ్‌కు బెంగళూర్‌లో ఒక అందమైన డుప్లెక్స్‌ ఇల్లు ఉంది. ప్రస్తుతం తన భార్య, ఇద్దరు పిల్లలతో అందులోనే నివాసముంటున్నారు. ఈ రాఖీభాయ్‌కు ఖరీదైన కార్లు ఉన్నాయి. రూ.80 లక్షలు విలువచేసే ఆడీ క్యూ7, రూ.70లక్షల బీఎమ్‌డబ్ల్యూ 520డితో పాటు రూ.40 లక్షల విలువచేసే స్పోర్ట్స్‌ కార్లు ఉన్నాయి. అంతే కాకుండా రూ.85 లక్షల మెర్సిడెస్‌ బెంజ్‌తో పాటు రేంజ్‌ రోవర్‌ కారును వాడుతున్నారు ఈ హీరో.

యశ్​ ఫ్యామిలీ

ప్రచార కర్తగా.. 'కేజీఎఫ్‌'తో తనే ఒక బ్రాండ్‌గా ఎదిగిన యశ్‌ కొన్ని ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. వాటిలో మొబైల్‌ సంస్థ సెల్కాన్‌ మొబైల్స్‌, అలాగే బియర్డోతో పాటు బ్రెయిన్‌చిల్డ్‌ వంటి ఫర్‌ఫ్యూమ్స్‌ల ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. ఒక్కో బ్రాండ్‌ను ప్రమోట్‌ చేసినందుకు సుమారు రూ.60లక్షల నుంచి రూ.కోటి దాకా తీసుకుంటారని తెలుస్తోంది.

'కేజీఎఫ్‌'కు ముందు తర్వాత.. యశ్‌ ప్రతి ఇంటర్వ్యూలో చెబుతున్నట్లుగానే తన జీవితం 'కేజీఎఫ్‌'కు తర్వాత పూర్తిగా మారిపోయింది. టీవీ సీరియల్‌ నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన యశ్‌ 'కేజీఎఫ్‌'తో పాన్‌ ఇండియా స్థాయికి ఎదిగారు.

ఇవీ చదవండి:

'సిద్ధ పాత్రలో పవన్​కల్యాణ్'.. చిరు స్పందన ఇదే

రెండు భాగాలుగా 'సలార్​'.. ఇంటర్వెల్ సీన్​కు అన్ని కోట్లా?

ABOUT THE AUTHOR

...view details