తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'నా కూతురుపై ఇలాంటి వార్తలు చూడటం నాకు ఇష్టం లేదు' - స్కూల్​మేట్​తో కీర్తి సురేశ్​ డేటింగ్​

గత కొంత కాలంగా సోషల్​ మీడియా వేదికగా స్టార్​ హీరోయిన్ కీర్తి సురేశ్​​ను పలు రిలేషన్​షిప్​ గాసిప్స్​ వెంటాడుతున్న విషయమై ఆమె తల్లి స్పందించారు. తన కూతురుపై ఇలాంటి వార్తలు చూడటం తనకు ఇష్టం లేదంటూ మండిపడ్డారు.

keerthy suresh
keerthy suresh

By

Published : Jan 29, 2023, 5:41 PM IST

అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేశ్​ అటు టాలీవుడ్​తో పాటు ఇటు కోలీవుడ్​లోనూ బిజీ బిజీగా ఉంటోంది. ఓ వైవు 'దసరా' షూటింగ్​కు బైబై చెప్పిన ఈ తార ఇటు చిరుకు చెల్లిగా 'భోళా శంకర్'​ సెట్స్​లో సందడి చేస్తోంది. తన నటనతో ఇప్పటికే సౌత్​లో స్టార్​డమ్​ తెచ్చుకున్న ఈ 'వెన్నెల' తాజాగా పలు రూమార్లకు కేరాఫ్​ అడ్రస్​గా నిలుస్తోంది. ఇటీవలే కోలీవుడ్​లోని ఓ స్టార్​ హీరోతో ఈమె గత కొంతకాలంగా రిలేషన్​లో ఉందని అంతే కాకుండా కీర్తి వల్ల ఆ స్టార్​ తన భార్యతో విడిపోయేందుకు సిద్ధపడినట్లు వార్తలు సైతం వచ్చాయి. అయితే వీటన్నింటికి మించిన రూమర్​ ఒకటి ప్రస్తుతం నెట్టింట హల్​చల్​ చేస్తోంది.

టాలీవుడ్​లో బిజీ షెడ్యూల్స్​లో గడుపుతున్న ఈ తార 13 ఏళ్లుగా ఒక అబ్బాయితో రిలేషన్​లో ఉన్నట్లు సోషల్​ మీడియాలో టాక్​ నడుస్తోంది. కేరళలోని పలు రిసార్టులకు ఓనరైన ఆ అబ్బాయి తన చిన్ననాటి చెలికాడు​ అంటూ పలు కథనాలు ప్రచురితమవుతున్నాయి. అయితే ఈ విషయంపై స్పందించిన కీర్తి సురేశ్​ తల్లి ఇవంతా రూమర్స్​ అంటూ కొట్టిపారేశారు. సెన్సేషన్​ క్రియేట్​ చేసేందుకే ఇలాంటి వార్తలను ప్రచురిస్తున్నారంటూ మండిపడ్డారు. కీర్తి విషయంలో ఇలాంటి వార్తలు చూడటం తమకు ఇష్టం లేదంటూ తేల్చి చెప్పారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. దసరా షూటింగ్​ పూర్తి చేసిన కీర్తి ప్రస్తుతం రివాల్వర్​ రీటా అనే సినిమాతో పాటు చిరంజీవీ భోళా శంకర్​, హొంబాలే ఫిల్మ్స్​ నిర్మిస్తున్న రఘు తాత షూట్స్​తో బిజీగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details