ఈ మధ్య కాలంలో సినీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సినిమా 'కాంతార'. సాధారణ చిత్రంగా విడుదలై దేశవ్యాప్తంగా విజయం సాధించింది. మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇది వరకు వచ్చిన చిత్రాలకు భన్నంగా ఉండటం.. మంచి మెసేజ్ కూడా ఇవ్వడం వల్ల ఉత్తరాది ప్రేక్షకులను కూడా అలరించింది. ఈ సినిమా సీక్వెల్ కోసం సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో 'కాంతార-2' ఉంటుందని హోంబలే ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు విజయ్ ఇదివరకే ప్రకటించారు. అప్పటినుంచి ఈ సినిమా గురించి మరో అప్డేట్ రాలేదు. తాజాగా కాంతార కథానయకుడు రిషబ్ శెట్టి స్పందించారు. ఈ సినిమా పార్ట్-2.. 2024లో విడుదలవుతుందని తెలిపారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పనులు మొదలుపెట్టినట్లు చెప్పారు. ఈ మూవీ 'కాంతార'కు సీక్వెల్ కాదని.. ప్రీక్వెల్‌గా వస్తున్నట్లు తెలిపారు. పార్ట్-1 స్టోరీ ఎక్కడ ప్రారంభమైందో.. దానికి ముందు జరిగిన సంఘటనలను పార్ట్-2లో చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఈ రెండో భాగంలో పంజుర్లికి సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని వెల్లడించారు.
'కాంతార' హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. పార్ట్-2 కథ ఇదేనన్న రిషబ్ శెట్టి! - kantara part 2 producer
సాధారణ సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది 'కాంతార'. ఈ చిత్రం సీక్వెల్ కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో 'కాంతార' హీరో రిషబ్ శెట్టి ఆసక్తికర కామెంట్లు చేశారు. పార్ట్-2 కథ గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. అవేంటంటే..
రిషబ్ శెట్టి డైరెక్షన్లో తెరకెక్కిన 'కాంతార' రిలీజైన అన్ని ప్రాంతాల్లో మంచి వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీక్వెల్‌లో ఏం చూపిస్తారని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక, రిషబ్ శెట్టికి సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ నటించే ఓ పీరియాడికల్ డ్రామాలో కీలకపాత్ర కోసం రిషబ్‌ను సంప్రదించినట్లు వార్తలొస్తున్నాయి. అయితే, రిషబ్ మాత్రం కన్నడ సినిమాలపైనే దృష్టి పెట్టాలని ఆ ఆఫర్‌ను వదులుకున్నట్లు తెలుస్తోంది.